Telangana Coroana: తెలంగాణలో తగ్గముఖం పడుతున్న కరోనా కేసులు.. కొత్తగా 3660మందికి పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,660 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మాయదారి రోగం బారినపడి కొత్తగా 23 మంది ప్రాణాలను కోల్పోయారు.
Telangana Covid-19: తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,660 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మాయదారి రోగం బారినపడి కొత్తగా 23 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇక, ఇవాళ వైరస్ నుంచి కోలుకున్న 4,826 మంది డిశ్చార్జీ అయ్యారు. తాజా కేసులతో కలుపుకుని తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 5,44,263కి చేరింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 45,757 ఉంది. కోవిడ్‌తో ఇప్పటివరకు మొత్తం 3,060 మృత్యువాతపడ్డారు. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య ఈ సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
ఇక, ఇవాళ ఒక్కరోజే 69,252 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొ్ంది. దీంతో రాష్ట్రం మొత్తంగా 1,43,36,254 సాంపిల్స్ పరీక్షించినట్లు వెల్లడింది. ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 574 మందికి కొత్తగా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఇక, జిల్లాల వారీగా నమోదైన పాజిటివ్ కేసులు ఇలా ఉన్నాయి….