దేశంలో ఇంకా మాస్కులు ధరించని 50 శాతం మంది….కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన, కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితిపై కలవరం

దేశంలో ఇప్పటికీ 50 శాతం మంది ప్రజలు మాస్కులు ధరించడంలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 64 శాతం మంది వీటిని ధరించినా ముక్కును కవర్ చేయరని (కప్పి పుచ్చుకోరని) ఓ అధ్యయనంలో వెల్లడైందని ఈ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు....

దేశంలో ఇంకా మాస్కులు ధరించని 50 శాతం మంది....కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన,  కొన్ని రాష్ట్రాల్లో  కోవిడ్ పరిస్థితిపై కలవరం
Without Mask Peoples
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 20, 2021 | 7:41 PM

దేశంలో ఇప్పటికీ 50 శాతం మంది ప్రజలు మాస్కులు ధరించడంలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 64 శాతం మంది వీటిని ధరించినా ముక్కును కవర్ చేయరని (కప్పి పుచ్చుకోరని) ఓ అధ్యయనంలో వెల్లడైందని ఈ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ప్రజల్లో 7 శాతం మంది మాత్రమే సరైన రీతిలో మాస్కులు ధరిస్తారని ఈ స్టడీ పేర్కొన్నట్టు ఆయన చెప్పారు.కోవిడ్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని నివారించాలంటే మాస్కుల వినియోగం, భౌతిక దూరం పాటింపు తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. మాస్కుల ప్రాధాన్యత గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే పలుమార్లు హెచ్చరించిందని ఆయన గుర్తు చేశారు. కాగా కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని రాష్టాల్లో ఇంకా 25 శాతం పాజిటివిటీ రేటు ఉందని, ఇది ఆందోళన కలిగిస్తోందని ఆయన చెప్పారు. లాక్ డౌన్ విధించినప్పటికీ ప్రజలు సరైన ప్రోటోకాల్ పాటించేలా చూడాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉందన్నారు. ఢిల్లీలో ఒక్కసారిగా కోవిద్ కేసులు చాలావరకు తగ్గిపోయిన విషయాన్ని లవ్ అగర్వాల్ ప్రస్తావించారు. చాలా రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు తగ్గినప్పటికీ మరణాల సంఖ్య పెరగడం విచారకరమన్నారు. వ్యాక్సిన్ల కొరత త్వరలోనే తీరుతుందని ఆశిస్తున్నామన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కోవిద్ కేసులు 50 వేల నుంచి లక్ష వరకు ఉన్నాయని, ఆయా రాష్ట్రాలు యాక్టివ్ కేసుల సంఖ్యను తగ్గించుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నాయని, టెస్టులను పెంచుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ నెలాఖరుకల్లా 25 లక్షల టెస్టులను నిర్వహించాలన్నది లక్ష్యమని ఐసీఎంఆర్ హెడ్ డా. బలరాం భార్గవ వెల్లడించారు. రాపిడ్ యాంటిజెన్ టెస్టులను కూడా పెంచుతామని ఆయన తెలిపారు. మరిన్ని చదవండి ఇక్కడ : Madhya Pradesh: కోవిడ్ సెంటర్‌లో టాయిలెట్ క్లీన్ చేసిన బీజేపీ ఎంపీ… ( వీడియో ) మధ్యదరా స‌ముద్రంలో ఘోరం….!! ప‌డ‌వ మునిగి 57 మంది మృతి… ( వీడియో )