Chiranjeevi : కరోనాతో మృతిచెందిన కార‌వ్యాన్ డ్రైవ‌ర్ కుటుంబానికి మెగాస్టార్ ఆర్ధిక సాయం..

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఎంతటి స్టార్ హీరోనో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అంతులేని అభిమాన గణం ఆయన సొంతం..

Chiranjeevi : కరోనాతో మృతిచెందిన కార‌వ్యాన్ డ్రైవ‌ర్ కుటుంబానికి మెగాస్టార్ ఆర్ధిక సాయం..
Megastar Chiranjeevi
Follow us
Rajeev Rayala

|

Updated on: May 21, 2021 | 8:53 AM

Chiranjeevi :

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఎంతటి స్టార్ హీరోనో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అంతులేని అభిమాన గణం ఆయన సొంతం. కేవలం సినిమాలతోనే కాదు సేవ కార్యక్రమాల్లోనూ ఆయన మెగాస్టారే.. ఎన్నో సేవాకార్యక్రమాలతో ప్రజలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు చిరు. ఇక ఈ కరోనా కష్టకాలంలో సినీ కార్మికుల కోసం సీసీసీ ఏర్పాటు చేసి సినీ కళాకారులను ఆర్ధికంగానూ ఆదుకుంటున్నారు చిరంజీవి. కరోనా మహమ్మారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు మెగాస్టార్ ఇటీవల సీనియర్ నటి పావల శ్యామల దయనీయ స్థితిలో  తెలిసి ఆర్ధికంగా సాయం చేసారు చిరు. ఇటీవల చిరంజీవి కార‌వ్యాన్ డ్రైవ‌ర్ కిలారి జయరామ్ కరోనా సోకి మృతి చెందారు. ఆయ‌న‌కు భార్య కె.శోభారాణి .. ఒక కుమార్తె వినోదిని (8) ఇద్ద‌రు కుమారులు కౌశిక్ (18), జ‌స్వంత్(12) ఉన్నారు. జయరామ్ మృతి ఆ కుటుంబాన్ని తీవ్ర క‌ల‌త‌కు గురి చేసింది. అనంత‌రం జయరామ్ కుటుంబాన్ని మెగాస్టార్ ఆదుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి అత‌డి కుటుంబానికి లక్ష రూపాయల చెక్ ని పంపించారు. జయరామ్ భార్య శోభ వారి పిల్ల‌లు చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ కి వ‌చ్చి చిరంజీవి యువ‌త అధ్య‌క్షుడు ర‌వణం స్వామినాయుడు చేతుల‌మీదుగా ఈ చెక్ ని అందుకున్నారు.

ఈ సంద‌ర్భంగా జయరామ్ భార్య శోభారాణి మాట్లాడుతూ- “చిరంజీవి గారు అన్నివేళ‌లా ఆప‌ద్భాంద‌వుడు. ప్ర‌తిసారీ మా కుటుంబానికి ఏ క‌ష్టం వ‌చ్చినా ఆదుకున్నారు. ఇంత‌కుముందు మా వారు (జయరామ్) బైక్ పై వెళుతూ యాక్సిడెంట్ కి గుర‌య్యారు. వెంట‌నే ఉపాస‌న గారికి ఫోన్ చేసి వైద్య స‌హాయం అందించారు. అప్పుడు మా కుటుంబానికి ఆర్థిక క‌ష్టం లేకుండా ఆదుకున్నారు. ఇప్పుడు మ‌రోసారి నా కుటుంబాన్ని ఆదుకున్నారు. ఇది నా పిల్ల‌ల‌కు పెద్ద సాయం. చిరంజీవి గారికి నా కృత‌జ్ఞ‌త‌లు“ అని అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

లాక్‏ డౌన్‏లో రహస్యంగా బిగ్‏బాస్ షో షూటింగ్.. 8 మంది సిబ్బందికి కరోనా… పోలీసుల రాకతో ట్విస్ట్..

మా ఇంట్లో 10 మందికి కరోనా వచ్చింది.. మానసికంగా.. శారీరకంగా కష్టాలు.. రవితేజ హీరోయిన్ ఎమోషనల్ ..