లాక్‏ డౌన్‏లో రహస్యంగా బిగ్‏బాస్ షో షూటింగ్.. 8 మంది సిబ్బందికి కరోనా… పోలీసుల రాకతో ట్విస్ట్..

కరోనా వైరస్..దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే.. ఇప్పుడు భారత్ పరిస్థితి దారుణంగా మారింది. కోవిడ్ సోకి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.

లాక్‏ డౌన్‏లో రహస్యంగా బిగ్‏బాస్ షో షూటింగ్.. 8 మంది సిబ్బందికి కరోనా... పోలీసుల రాకతో ట్విస్ట్..
Bigg Boss
Follow us

|

Updated on: May 20, 2021 | 10:26 PM

కరోనా వైరస్..దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే.. ఇప్పుడు భారత్ పరిస్థితి దారుణంగా మారింది. కోవిడ్ సోకి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంతేకాకుండా లక్షల సంఖ్యలో ఆసుపత్రులలో చికిత్సలు తీసుకుంటున్నారు. ఈ వైరస్ బారిన పడి సామాన్యుల నుంచి సెలబ్రెటిల వరకు ఎంతో మంది ప్రాణాలు పోయాయి. ఇక చాలా మంది సినీ ప్రముఖులు తమ ఆత్మీయులను పోగోట్టుకుంటున్నారు. ఈ వైరస్ కట్టడికి ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఒక వైపు ప్రజలు.. మరోవైపు ప్రభుత్వాలు ఈ వైరస్ నియంత్రణకు కృషి చేస్తుంటే కొందరు మాత్రం కరోనాతో సంబంధం లేకుండా.. తమ పనులు కానిచ్చేస్తున్నారు. ఇప్పటికే కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్స్ వాయిదా పడగా.. ఓ రియాల్టీ షో నిర్వాహకులు మాత్రం రహస్యంగా షూటింగ్ చేస్తున్నారు. అదేవరో కాదండోయ్.. మలయాళ బిగ్‏బాస్ షో నిర్వాహకులు చేసిన పనికి అందరూ షాక్ తిన్నారు.

ఒకవైపు రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతుండగా.. తమకేం పట్టదన్నట్లు ఆ షో నిర్వహకులు వ్యవహరించారు. మూడో సీజన్ ను లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ షోలో ఎనిమిది మంది సిబ్బంది కరోనా బారిన పడినప్పటికీ నిర్వాహ‌కులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరోనా నిబంధనలకు విరుద్ధంగా ఆర్డీవో ప్రీతి పర్కావి.. షూటింగ్ జరుగుతున్న చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్ సిటీకి పోలీసులతో కలిసి వెళ్లి దాన్ని అడ్డుకున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లతో పాటు ఇతర సిబ్బందిని పంపించేశారు. ఆ తర్వాత సెట్ ను సీల్ చేసి, నిర్వహకులపై కేసు నమోదు చేశారు. హౌస్‌మేట్స్‌ను అక్కడి నుంచి హోటల్‌కు పంపించారు. మలయాళ బిగ్‌బాస్‌ మూడో సీజన్ కు మోహ‌న్ లాల్ వ్యాఖ్యాత‌గా వ్యవహరిస్తున్నారు. ఇక బిగ్ బాస్ షో నిర్వహకులు చేసిన పనికి విమర్శలు వస్తున్నాయి.

Also Read: రాఘవేంద్రుడి పుట్టిన రోజున మరో సర్‏ఫ్రైజ్.. దర్శకేంద్రుడి అభిమానులకు ‘పెళ్లి సందడి’ టీం స్పెషల్ ట్రీట్..

Manchu Manoj: మంచు మనోజ్ దాతృత్వం.. కరోనా కష్టంలో వారికి అండగా.. పుట్టినరోజు వేళ 25వేల కుటుంబాలకు సాయం..