రాఘవేంద్రుడి పుట్టిన రోజున మరో సర్‏ఫ్రైజ్.. దర్శకేంద్రుడి అభిమానులకు ‘పెళ్లి సందడి’ టీం స్పెషల్ ట్రీట్..

రాఘవేంద్రుడి పుట్టిన రోజున మరో సర్‏ఫ్రైజ్.. దర్శకేంద్రుడి అభిమానులకు 'పెళ్లి సందడి' టీం స్పెషల్ ట్రీట్..
Pelli Sandadi

Pelli Sandadi: పెళ్లి సందడి.. గత పాతికేళ్ళ క్రితం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం. శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన

Rajitha Chanti

|

May 20, 2021 | 7:49 PM

Pelli Sandadi: పెళ్లి సందడి.. గత పాతికేళ్ళ క్రితం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం. శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విజయవంతంగా దాదాపు సంవత్సరం పాటు థియేటర్లలో ప్రదర్శించబడింది. ఇక ఈ సినిమా మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ పాటలు శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని ఇందించారు. ఈ సూపర్ హిట్ సినిమా ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తుండగా.. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో గౌరి రోనంకి దర్శకత్వం వహిస్తుండగా… కృష్ణమోహన్ రావు సమర్పణలో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా గత పెళ్లి సందడి చిత్రానికి సిక్వెల్ కాదని ఇప్పటికే ప్రకటించింది చిత్రయూనిట్. ఇక ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ఇప్పటికే విడుదలై.. సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా దర్శకేంద్రుడి పుట్టిన రోజు అంటే మే 23న ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేయనున్నారట. రాఘవేంద్రరావు, కీరవాణిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ప్రతి పాట మ్యూజిక్ లవర్స్ కు కచ్చితంగా నచ్చుతాయని.. డైరెక్టర్ గా నాకు ఇది ఒక ఛాలెజింగ్ ప్రాజెక్ట్ అని.. సినిమా చాలా బాగా వస్తుందని డైరెక్టర్ గౌరి రోనంకి చెప్పారు. ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, పోసాని కృష్మ మురళి, వెన్నెల కిషోర్ రాజీవ్ కనకాల అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Also Read: లక్కీ ఛాన్స్ అందుకున్న బాలీవుడ్ హీరోయిన్.. హాలీవుడ్‏ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. పవర్‏ఫుల్ పాత్రలో బ్యూటీ..

Manchu Manoj: మంచు మనోజ్ దాతృత్వం.. కరోనా కష్టంలో వారికి అండగా.. పుట్టినరోజు వేళ 25వేల కుటుంబాలకు సాయం..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu