ఆ వార్తలు నిజం కావు.. కన్ఫామ్ అయితే నేనే మీకు చెబుతా… పవన్ మూవీ రూమర్స్ పై బండ్ల గణేష్ క్లారిటీ..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: May 20, 2021 | 8:06 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వెంటవెంటనే ఆ చిత్రాలను సెట్స్ పైకి తీసుకోచ్చేశాడు కూడా.

ఆ వార్తలు నిజం కావు.. కన్ఫామ్ అయితే నేనే మీకు చెబుతా... పవన్ మూవీ రూమర్స్ పై బండ్ల గణేష్ క్లారిటీ..
Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వెంటవెంటనే ఆ చిత్రాలను సెట్స్ పైకి తీసుకోచ్చేశాడు కూడా. ఇటీవలే పవన్ వకీల్ సాబ్ సినిమాతో మరోసారి సూపర్ హిట్ అందుకున్నారు. ఇక అదే జోష్ తో పవన్ వరుస సినిమాలను చేస్తూ ఫుల్ బిజీగా మారాడు. ఇక కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్స్ కు బ్రేక్ పడింది. ఇక ఇదే క్రమంలో పవన్ తదుపరి సినిమాలపై అనేక రూమర్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. Bandla Ganesh

ఇక ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాలు చేస్తున్నాడు. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ బ్యానర్ పై ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత నిర్మాత బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో మరో మూవీ చేసేందుకు సిధ్దంగా ఉన్నాడు. దీంతో వీరిద్ధరి కాంబోలో రాబోతున్న సినిమా గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. అయితే ఆ రూమర్స్ పై బండ్ల గణేష్ చాలా సార్లు క్లారిటీ ఇచ్చారు. తాజాగా వీరిద్దరి సినిమా గురించి మరో రూమర్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్ కాంబోలో రాబోతున్న సినిమాను డైరెక్టర్ రమేష్ వర్మ తెరకెక్కించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై బండ్ల గణేష్ మరోసారి స్పంధించారు… అవన్నీ తప్పుడు వార్తలని.. అన్ని కన్ఫామ్ అయ్యాక తానే చెబుతాను అంటూ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రమేష్ వర్మ.. రవితేజ ప్రధాన పాత్రలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. Pawan Kalyan

Also Read: రాఘవేంద్రుడి పుట్టిన రోజున మరో సర్‏ఫ్రైజ్.. దర్శకేంద్రుడి అభిమానులకు ‘పెళ్లి సందడి’ టీం స్పెషల్ ట్రీట్..

Manchu Manoj: మంచు మనోజ్ దాతృత్వం.. కరోనా కష్టంలో వారికి అండగా.. పుట్టినరోజు వేళ 25వేల కుటుంబాలకు సాయం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu