AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Family Man 2 controversy: ఫ్యామిలీ మ్యాన్ 2 వివాదం పై స్పందించిన సమంత.. ఏమన్నదంటే..

'ఫ్యామిలీ మ్యాన్ 1' కు  కొనసాగింపుగా రూపొందిన  వెబ్ సిరీస్‌ ఫ్యామిలీ మ్యాన్ 2.  సిరీస్ లను దర్శకులు రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు.

The Family Man 2 controversy: ఫ్యామిలీ మ్యాన్ 2 వివాదం పై స్పందించిన సమంత.. ఏమన్నదంటే..
Samantha
Rajeev Rayala
|

Updated on: May 21, 2021 | 3:45 PM

Share

The Family Man 2 controversy: ‘ఫ్యామిలీ మ్యాన్ 1’ కు  కొనసాగింపుగా రూపొందిన  వెబ్ సిరీస్‌ ఫ్యామిలీ మ్యాన్ 2.  సిరీస్ లను దర్శకులు రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. మొదటి భాగంలో నటించిన మనోజ్ భాజ్ పాయ్, ప్రియమణిలతో పాటు సెకండ్ సిరీస్ లో అక్కినేని సమంత  కీలక పాత్రల్లో కనిపించారు. అయితే అనుకోని విధంగా ఈ వెబ్ సిరీస్ వివాదంలో చిక్కుకుంది. ఈ  సిరీస్ పై తమిళ్ ప్రజలు గుర్రుగా ఉన్నారు. అయితే తమిళ తంబీలు కాస్త “ప్రశాంతంగా ఉండండి.”.. అంటూ ట్విట్టరల్లో ట్వీట్ చేశారు సమంత. ఫ్యామిలీ మ్యాన్‌ సెకండ్‌ సిరీస్‌లో.. తన క్యారెక్టర్‌ పై వస్తున్న ట్రోల్స్‌కు ఆమె ఈ విధంగా స్పందించారు. ఈ సిరీస్‌ ట్రైలర్‌ రీసెంట్‌గా యూట్యూబ్లో రిలీజ్‌ అయి కాంట్రవర్సీ అయింది. ఈ ట్రైలర్‌లో కొన్ని సీన్లు తమిళుల మనోభావాలను కించపరిచేవిగా ఉన్నాయని సోషల్ మీడియాలో తమిళులు విరుచుకుపడ్డారు. ఈ సిరీస్‌కి వ్యతిరేఖంగా “ఫ్యామిలీ మ్యాన్-2 ఎగైనెస్ట్ తమిళ్” అనే హాష్‌ ట్యాగ్‌ను కూడా వైరల్‌ చేశారు. తమిళుల కోసం పోరాడిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలంకి ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు ట్రైలర్ లో చూపించడం దారుణం అని సోషల్ మీడియాలో కమెంట్ల వర్షం కురిపిచారు. శ్రీలంకలో తమిళ వాసుల కోసం పోరాడిన LTTE అసలు టెర్రరిస్ట్ సంస్థే కాదని, సామ్ తమిళ నటి అయ్యి కూడా ఇలాంటి పాత్రలో నటించడం ఏంటంటూ సోషల్ మీడియా వేదికలపై కాస్త గట్టిగానే ఫైర్ అయ్యారు తమిళ తంబీలు.

దీంతో దిగివచ్చిన ప్రైమ్… రీసెంట్‌గా రీఎడిట్ చేసిన ట్రైలర్‌ను యూట్యూబ్‌లో మళ్లీ రిలీజ్‌ చేసింది. ఈ ట్రైలర్‌లో సమంతకు సంబంధించిన కొన్ని సీన్లకు కత్తెర వేసి తమిళ తంబీలను శాంతింపజేసేందుకు ట్రై చేసింది.ఇక ఇప్పుడు సమంత కూడా తాజాగా ఈ వివాదం పై స్పందించారు. keep calm and have faith అనే సేయింగ్‌ ఉన్న ఫోటోను తన ట్విట్టర్లో షేర్ చేశారు. ఇక ఇదంతా చూస్తుంటే.. ఈ సిరీస్‌లో LTTE కి సబంధించిన సన్నివేశాలను తొలగొంచి… తమిళ్ తంబీలు నొచ్చుకోని విధంగా సరీస్‌ విడుదల చేస్తారనే ప్రచారం ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. అసలు సామ్ ట్వీట్ లో ఉన్న అర్థం అయితే పర్వాలేదు కానీ  అది కాకపోతే మాత్రం… మళ్లీ పోరాటం ఖాయం అంటూ.. తమిళ తంబీలు సోషల్ మీడియా వేదికగా అప్పుడే హింట్ ఇస్తున్నారు.  మరి ఈవివాదం ఎక్కడివరకు వెళ్తుదో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Ponnambalam: ‘చిరంజీవి అన్నయ్యా మీ సాయం మరువలేనిది’.. ఎమోషనల్ అయిన నటుడు..

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలు ఏవో తెలుసా..