Facebook: కరోనా సెకండ్ వేవ్.. భారత్‌లో ఫేస్‌బుక్ సరికొత్త టూల్.. ఎలా పనిచేస్తుందంటే..?

COVID-19 Announcement - India: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజూ లక్షలాది మంది కరోనా బారిన పడుతుండగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కోవిడ్ -19 నియంత్రణకు

Facebook: కరోనా సెకండ్ వేవ్.. భారత్‌లో ఫేస్‌బుక్ సరికొత్త టూల్.. ఎలా పనిచేస్తుందంటే..?
Facebook
Follow us
Shaik Madar Saheb

| Edited By: Ram Naramaneni

Updated on: May 21, 2021 | 9:24 AM

COVID-19 Announcement – India: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజూ లక్షలాది మంది కరోనా బారిన పడుతుండగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కోవిడ్ -19 నియంత్రణకు కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఫేస్‌బుక్ సరికొత్త టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కోవిడ్ సంబంధిత వార్తలను ప్రజలు ఎప్పటికప్పుడు సకాలంలో షేర్ చేసుకునే విధంగా ఈ టూల్ ఉపయోగపడనుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఆరోగ్య శాఖలు పరస్పరం కోవిడ్ సంబంధిత అప్‌డేట్లను తెలుసుకునేందుకు ఈ టూల్‌ను రూపొందించారు.

కరోనా కారణంగా తలెత్తిన ప్రజారోగ్య సంక్షోభం నేపథ్యంలో ప్రజలను సురక్షితంగా, అప్రమత్తంగా ఉంచేందుకు కృషిచేస్తున్న ప్రభుత్వ సంస్థలకు మద్దతుగా ఈ టూల్ ప్రవేశపెడుతున్నట్టు ఫేస్‌బుక్ వెల్లడించింది. ఈ టూల్‌ను ముందుగా అమెరికాలో ప్రారంభించారు. తాజాగా దీన్ని అందుకుంటున్న రెండో దేశంగా భారత్ నిలిచింది. దీన్ని అమలు చేసేందుకు ఫేస్‌బుక్ మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆరోగ్య శాఖల్లోని అధికారులు తమ పరిధిలో కొవిడ్-19, వ్యాక్సినేషన్‌పై ఎప్పటికప్పుడు ఈ టూల్ ద్వారా ప్రజలకు సమాచారం చేరవేస్తారు.

ఫేస్‌బుక్ పేజీల్లో రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు పెట్టే పోస్టులను కొవిడ్-19 ప్రకటనలుగా గుర్తించి.. ప్రజలకు అవి మరింత త్వరగా వెళ్లే విధంగా ఫేస్‌బుక్ ప్రమోట్ చేస్తుంది. మహమ్మారి అధిక ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు త్వరగా సమాచారం అందించేందుకు.. ఫేస్‌బుక్ నోటిఫికేషన్లు కూడా పంపనుంది. కోవిడ్-19 ఇన్‌ఫర్మేషన్ సెంటర్ల‌లోని సమాచారాన్ని కూడా ఫేస్‌బుక్ టూల్ అందిస్తుంది. దీంతోపాటు వ్యాక్సినేషన్, తదితర ముఖ్యమైన, అత్యవసర అప్‌డేట్లను ప్రజలతో పంచుకునేందుకు ఇది ఉపయోగపడనుంది.

Also Read:

కోవిద్ తో తలిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు నెలకు రూ. 1500 సాయం, పంజాబ్ ప్రభుత్వ ప్రకటన, 21 ఏళ్ళ వరకు వెసులుబాటు

Israel Palestine Crisis: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని మెచ్చుకున్న ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్.. ఎందుకంటే..!