its a war crime: అది యుద్ధ నేరమే ! అంతర్జాతీయయ కోర్టులో గాజా సిటీ భవన యజమాని ఫిర్యాదు , పరిహారం లభిస్తుందా ?
గాజా సిటీలో అంతర్జాతీయ మీడియా కార్యాలయాలు ఉన్న 13 అంతస్థుల భవనం ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ధ్వంసమైంది.
గాజా సిటీలో అంతర్జాతీయ మీడియా కార్యాలయాలు ఉన్న 13 అంతస్థుల భవనం ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ధ్వంసమైంది. ఆల్-జజీరా, టీవీ మీడియా , అసోసియేటెడ్ ప్రెస్ వంటి అనేక పత్రికా, వార్తా కార్యాలయాలు ఇందులో ఉన్నాయి. ఇవి పూర్తిగా దెబ్బ తిన్నాయి. దీంతో ఈ భవన యజమాని జవాద్ మెహదీ ..ఇది యుధ్ధ నేరమేనంటూ అంతర్జాతీయ కోర్టుకెక్కాడు. మే 15 న జరిగిన దాడుల్లో జలా టవర్ అనే ఈ భవనం నేలమట్టమైందని, దీన్ని యుధ్ద నేరంగా పరిగణించాలని ఆయన కోరాడు. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఇటీవల జరిగిన హింస సందర్బంగా ‘నేరాలు జరిగినట్టే’ భావించాల్సి ఉంటుందని ప్రపంచ కోర్టు ప్రాసిక్యూటర్ వ్యాఖ్యానించారు. ఈ భవన యజమాని ఫిర్యాదును కోర్టు సానుకూలంగా పరిశీలిస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇందులో సైనిక ఆయుధాలు గానీ, సైనిక బృందం గానీ ఉందని ఇజ్రాయెల్ భావించినట్టు కనబడిందన్నారు. మిలిటరీ కార్యక్రమాలకు సివిలియన్ ఈక్విప్ మెంట్ ను వినియోగించిన పక్షంలో దాన్ని నాశనం చేయాలన్న నిబంధన అంతర్జాతీయ చట్టంలో ఉందన్నారు. జవాద్ మెహదీ ఈ-మెయిల్ ద్వారా ఈ కోర్టుకు తన ఫిర్యాదును పంపినట్టు ఆయన చెప్పారు. 13 అంతస్థుల ఈ విశాలమైన బిల్డింగ్ లో హమాస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ నెట్ వర్క్ ఉందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. బహుశా అందువల్లే దీన్ని టార్గెట్ చేసినట్టు భావిస్తున్నారు.
కాగా కేవలం గంటలోగా ఈ భవనాన్ని ఖాళీ చేయాలనీ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అధికారి తమను ఆదేశించారని మెహదీ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సిబ్బందిని తక్షణమే ఖాళీ చేయించడంలో తాము ఎన్నో అవస్థలు ఎదుర్కొన్నట్టు ఆయన తెలిపారు. మరి ఈయనకు పరిహారం లభిస్తుందా అన్న విషయం తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఆఫీసులో బుస బసలు.. అధికారులకు చుక్కల చూపించిన కొండచిలువ..!! ( వీడియో )
Viral Video: పోలీసుల నుంచి తప్పించుకుని డ్రైనేజీలో దూకిన దొంగ.. వైరల్గా మారిన వీడియో...
Viral Video: చపాతీలు ఇలా కూడా చేస్తారా..?? ఈ స్టైల్ చూసి ఫిదా ఆయన నెటిజన్లు.. ( వీడియో )