AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megha Rajagopalan: భారత సంతతి జర్నలిస్టుకు పులిట్జర్ పురస్కారం.. చైనా బండారం బయటపెట్టినందుకు..

Pulitzer Prize: అమెరికాలో పనిచేస్తున్న భారత సంతతికి చెందిన జర్నలిస్టు మేఘా రాజగోపాల్ ప్రతిష్టాత్మక పులిట్జర్ బహుమతికి ఎంపికయ్యారు. ఆ దేశంలో ఏటా ఈ అవార్డును 21 కేటగిరిల్లో కృషి చేసిన వ్యక్తులకు ప్రదానం చేస్తున్నారు.

Megha Rajagopalan: భారత సంతతి జర్నలిస్టుకు పులిట్జర్ పురస్కారం.. చైనా బండారం బయటపెట్టినందుకు..
Megha Rajagopalan
Janardhan Veluru
|

Updated on: Jun 12, 2021 | 7:35 PM

Share

అమెరికాలో పనిచేస్తున్న భారత సంతతికి చెందిన జర్నలిస్టు మేఘా రాజగోపాల్ ప్రతిష్టాత్మక పులిట్జర్ బహుమతికి ఎంపికయ్యారు. ఆ దేశంలో ఏటా ఈ అవార్డును 21 కేటగిరిల్లో కృషి చేసిన వ్యక్తులకు ప్రదానం చేస్తున్నారు. ఇరవై కేటగిరీల్లో విజేతలకు తలా 15,000 డాలర్లు నగదు బహుమతిని అందజేస్తుండగా… పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో విజేతకు బంగారు పతకం ప్రదానం చేస్తున్నారు. పరిశోధన విభాగంలో మేఘా రాజగోపాలన్ ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. చైనాలోని రహస్య క్యాంపుల్లో వేలాది మంది ముస్లింలు ఉంచిన విషయాన్ని బహిర్గతం చేసినందుకు ఆమె పులిట్జర్ బహుమతికి ఎంపికయ్యారు. మరో భారత సంతతికి చెందిన జర్నలిస్ట్ నీల్ బేడీ కూడా పులిట్జర్ బహుమతికి ఎంపికయ్యారు

మేఘా రాజగోపాలన్ ఎవరు? లండన్ లోని ‘బజ్ ఫీడ్ న్యూస్’ రిపోర్టర్ గా మేఘా రాజ గోపాలన్ పనిచేస్తున్నారు. చైనా, థాయ్ లాండ్, ఇజ్రాయిల్, పాలస్తీనాలకు స్టాప్ కరస్పాండెంట్ గా ఆమె వ్యవహరిస్తున్నారు. ఆసియా, మధ్య ఆసియా లోని మొత్తం 23 దేశాల నుంచి రిపోర్టింగ్ చేసిన అనుభవం ఆమె సొంతం. చైనాలోని వీగర్లను నిర్బంధించిన క్యాంపులను తొలిసారిగా ప్రపంచానికి తెలియజేసిన ఘనత సాధించారు. భారత సంతతికి చెందిన మెఘా రాజగోపాలన్ సహా మరో ఇద్దరు కంట్రిబ్యూటర్లు అలీసాన్ కిల్లింగ్, క్రిస్టోఫర్ బుస్చెక్ లకు అంతర్జాతీయ పరిశోధనాత్మక జర్నలిజం కేటగిరిలో పులిట్జర్ అవార్డు దక్కించుకున్నారు. చైనాలోని గ్జిన్ జియాంగ్ ప్రాంతంలో వేలకొద్దీ ముస్లింలను జైల్లో ఉంచిన తీరు, అక్కడి రహస్య నిర్మాణాలను వారు ప్రపంచానికి తెలియజేశారు. 2017 నుంచి చైనా గ్జిన్ జియాంగ్ ప్రాంతంలో ముస్లింలను బలవంతంగా క్యాంపుల్లో ఖైదుచేస్తున్న తీరును బయటపెట్టారు.

ముస్లిం ఖైదు క్యాంపు ప్రాంతాలు చైనాలో లేవని చైనా సర్కారు బుకాయించింది. రాజగోపాలన్ నోటిని మూయడానికి ఆమె వీసా రద్దు చేస్తూ.. దేశం నుంచి చైనా బహిష్కరించింది. పశ్చిమ దేశాల జర్నలిస్టులను ఈ ప్రాంతం వైపు వెళ్లకుండా అడ్డుకుంది. అయినా.. పట్టు సడలించిన రాజ గోపాలన్ ఇద్దరు కంట్రిబ్యూటర్లతో ఉపగ్రహ ఇమేజ్ లనుపయోగించి చైనాలో ముస్లింలను ఖైదు చేసిన ప్రాంతాలను గుర్తించింది.

మరో భారత సంతతి జర్నలిస్టుకు పులిట్జర్ అవార్డు..

అమెరికాలో లోకల్ రిపోర్టింగ్ విభాగంలో మరో భారత సంతతికి చెందిన జర్నలిస్ట్ నీల్ బేడీకి పులిట్జర్ బహుమతికి ఎంపికయ్యారు. టాంపా బే టైమ్స్ లోకల్ రిపోర్టింగ్ విభాగంలో నీల్ బేడి పనిచేస్తున్నారు. బేడీతో పాటు మరో కంట్రీ బ్యూటర్ కాథలీన్ మెక్ గ్రోరీ ఈ పురస్కారాన్ని పొందారు. అమెరికాలో పోస్కో కౌంటీ షెరీఫ్ కార్యాలయం అనుమానిత నేరస్థులను గుర్తించేందుకు రూపొందించిన కంప్యూటర్ మోడలింగ్ వ్యవస్థను బేడీ, కాథలీన్ బహిర్గతం చేశారు.

Also Read..ట్రైన్ టికెట్ ఖర్చు..హెలికాప్టర్ ప్రయాణం..అదే డ్రోన్ బస్సు..రెడీ అవుతోంది!