AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. ఆ దేశంలో విజృంభిస్తున్న ప్రాణాంతక వైరస్.. ముగ్గురు మృతి.. కరోనా కన్నా డేంజర్..

ఆఫ్రికాలోని ఇథియోపియాలో మరో వైరస్ అందరినీ భయపెడుతుంది. ఇది ఎబోలా లాంటి అత్యంత ప్రమాదకరమైనది. పండ్ల గబ్బిలాల నుండి మనుషులకు వ్యాపించి, శరీర ద్రవాల ద్వారా త్వరగా అంటుకుంటుంది. దీనికి ప్రత్యేక చికిత్స లేకపోవడం ఆందోళణ కలిగిస్తుంది. దీన్ని లక్షణాలు, మరణం ఎలా సంభవిస్తుందనేది తెలుసుకుందాం..

వామ్మో.. ఆ దేశంలో విజృంభిస్తున్న ప్రాణాంతక వైరస్.. ముగ్గురు మృతి.. కరోనా కన్నా డేంజర్..
Marburg Virus Outbreak In Ethiopia
Krishna S
|

Updated on: Nov 18, 2025 | 7:28 PM

Share

ఆఫ్రికాలో మరోసారి అత్యంత ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తి మొదలైంది.  ఇది ఎబోలా లాంటి చాలా ప్రమాదకరమైనది. దక్షిణ సూడాన్ సరిహద్దుల్లోని ప్రాంతంలో మార్బర్గ్ హెమరేజి ఈ వైరస్‌ను గుర్తించిన ఇథియోపియా ప్రభుత్వం.. వైరస్‌తో ముగ్గురు చనిపోయారని ధ్రువీకరించింది. ఇథియోపియాలోని ఓమో అనే దక్షిణ ప్రాంతంలో ఈ వైరస్‌ను గుర్తించారు. మొత్తం 17 అనుమానిత కేసులపై పరీక్షలు చేయగా, 3 మరణాలు మార్బర్గ్ వల్లే వచ్చాయని ఆరోగ్య మంత్రి మెక్దేస్ డాబా చెప్పారు. ఇప్పుడు యాక్టివ్ కేసులు ఏమీ లేకపోయినా, ఈ వైరస్ మళ్లీ రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆఫ్రికా సీడీసీ నుంచి నిపుణుల బృందాలు ఇథియోపియాకు వచ్చి సహాయం చేస్తున్నాయి.

ఈ వైరస్ ఎందుకు ప్రమాదకరం?

మార్బర్గ్ వైరస్ చాలా ప్రమాదకరమైంది. ఈ వైరస్ పండ్ల గబ్బిలాల నుంచి మనుషులకు వస్తుంది. సోకిన మనుషుల రక్తం, లాలాజలం వంటి శరీర ద్రవాల ద్వారా లేదా వస్తువులను తాకడం ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి త్వరగా అంటుకుంటుంది. తీవ్రమైన జ్వరం, కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు ఉంటాయి. కొన్నిసార్లు శరీరంలోంచి రక్తం కూడా పోతుంది. దీనికి సరైన చికిత్స లేకపోతే ఈ జబ్బు వచ్చిన వారిలో 100 మందిలో 88 మంది వరకు చనిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ వ్యాధిని ఆపడానికి ప్రత్యేక టీకా లేదా మందు లేదు. కేవలం రోగికి సహాయపడే చికిత్స మాత్రమే అందిస్తారు.

పొరుగు దేశాల భయం

ఇథియోపియా సరిహద్దులో ఉన్న దక్షిణ సూడాన్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఎందుకంటే అక్కడి ఆరోగ్య వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. అందుకే ప్రజలు తరచుగా చేతులు కడుక్కోవాలని, ఎవరి శరీర ద్రవాలను తాకకుండా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ వ్యాధి గతంలో కూడా ఆఫ్రికాలోని రువాండా, టాంజానియా, ఉగాండా వంటి చాలా దేశాలలో నమోదైంది. అందుకే ప్రపంచ ఆరోగ్య నిపుణులు ఈ కొత్త వ్యాప్తిపై దృష్టి పెట్టారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్

ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..

ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్

ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే

జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'

కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌

భర్త ఫోటో రివీల్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి..

700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత

రన్నింగ్‌ ట్రైన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? టెన్షనొద్దు!

చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో

మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు

అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం