తల్లి చేసిన అద్బుతం కోమాలో నుంచి కూతురు బయటకు
చైనాలో ఓ తల్లి తన కూతురిని 10 ఏళ్ల కోమా నుండి అద్భుతంగా బయటకు తెచ్చింది. వైద్యులు ఆశలు వదిలేసినా, ఆ తల్లి నిత్యం వీల్‌చైర్‌లో కూతురిని పార్కుకు తీసుకెళ్లి డాన్స్ చేసింది. సంగీతం, డాన్స్ థెరపీతో కూతురు కోమా నుండి మేల్కొంది. తల్లి అకుంఠిత పట్టుదల, ప్రేమకు ఇది గొప్ప నిదర్శనం, ఎందరికో స్ఫూర్తినిస్తోంది.
తల్లి చేసిన అద్భుతంతో కోమాలోకి వెళ్లిన యువతి పదేళ్ల తర్వాత బయటపడింది. ఇక తమ వల్ల కాదని వైద్యులు చేతులెత్తేస్తే.. ఆ తల్లి మాత్రం తన బిడ్డను వదిలేయలేదు. ఒకటా రెండా ఏకంగా పదేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆమెను తిరిగి సాధారణ మనిషిని చేసింది. ప్రతిరోజూ డ్యాన్స్‌కి తీసుకెళ్లి అద్భుతాలు సృష్టించింది. తన కుమార్తెకు తిరిగి జీవం పోయాలనే ఆ తల్లి సంకల్పం ముందు విధి తలవంచింది. కోమాలో నుంచి బయటపడిన ఆ యువతి ఇప్పుడు తన పనులు తానే చేసుకోగలుగుతోంది. ఈ అద్భుత సంఘటన చైనాలో చోటుచేసుకుంది. చైనాలోని హునన్ ప్రావిన్స్‌కు చెందిన షియోవో అనే మహిళకు యాంగ్ అనే కుమార్తె ఉంది. పదేళ్ల కిందట యాంగ్ తీవ్ర అనారోగ్యానికి గురై కోమాలోకి వెళ్లిపోయింది. ఆసుపత్రిలో కొన్ని రోజుల చికిత్స అనంతరం వైద్యులు చేతులెత్తేశారు. ఆమె కోలుకునే అవకాశాలు తక్కువని చెప్పారు. చచ్చుబడిన నాడులను ఉత్తేజపరచడానికి సంగీతం, డాన్స్ సహాయపడొచ్చని సూచించారు. దీంతో ప్రతిరోజు ఉదయం, షియావో తన కూమార్తెను వీల్‌చెయిర్‌లో కూర్చోబెట్టి సమీపంలోని పార్క్‌కి తీసుకెళ్లేది. స్క్వేర్ డ్యాన్స్ మ్యూజిక్‌కు తాళం వేస్తూ.. తన కుమార్తె చెయ్యి పట్టుకుని ఆడేది. షియావో కథ గురించి తెలిసి ఆమెకు సహాయం చేయడానికి స్క్వేర్ డ్యాన్స్ ఆంటీలు ముందుకొచ్చారు. తల్లి చేస్తున్న కొత్త స్టెప్‌లు చూసి రెండో ఏడాదిలో యాంగ్ మాట్లాడింది. ‘నువ్వు చాలా గొప్ప వ్యక్తివి’ అంటూ తల్లిని ఉద్దేశించి కుమార్తె నోటి వెంట తొలి మాట రావడంతో తల్లి భావోద్వేగానికి గురైంది. వెంటనే కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. యాంగ్‌ను పరీక్షించిన వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆమె మెదడు మళ్లీ చురుకుగా మారినట్టు గ్రహించారు. ఇది ఓ అద్భుతమని అన్నారు. గత పదేళ్లుగా షియావో రోజూ తన కూతురితో కలిసి స్క్వేర్ డ్యాన్స్ ప్రాక్టీస్ కొనసాగించడం వల్ల యాంగ్ నడవడం, మాట్లాడడం చేసింది. ప్రస్తుతం యాంగ్ తన పనులు తానే చేసుకుంటోంది. కానీ, ఆమెకు జ్ఞాపకశక్తి తిరిగి రాలేదు. తన తల్లిదండ్రులను మాత్రమే గుర్తుపడుతోంది. షియావో ఇంటర్వ్యూను యూట్యూబ్‌లో చూసిన నెటిజన్లు పదేళ్లు ఆమె చూపిన పట్టుదల ఎందరికో ప్రేరణ అని తల్లి ప్రేమ అద్భుతాలను సృష్టిస్తుందని ప్రశంసలు కురిపిస్తున్నారు. డ్యాన్స్, సంగీతం మాటల్లో చెప్పలేని శక్తిని అందిస్తాయని అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చుట్టూ ఈదుతున్న చేపలు.. వాటి మధ్య లంచ్
30 రోజుల్లో 10 కేజీలు తగ్గి.. స్టేజ్ పై కుప్పకూలిన సింగర్
దినసరి కూలీకి రూ.35 కోట్ల జీఎస్‌టీ బిల్లు
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

