దారుణం.. యజమానిని కట్టేసి భారీ దోపిడీ
హైదరాబాద్‌లో రిటైర్డ్ కల్నల్ గిరి ఇంట్లో దారుణం చోటుచేసుకుంది. ఇంటి పనివారి సాయంతో నలుగురు దుండగులు రూ.50 లక్షల విలువైన బంగారం, నగదును దోచుకెళ్లారు. గన్‌రాక్ ఎన్‌క్లేవ్‌లో జరిగిన ఈ దోపిడీలో కల్నల్‌పై దాడి చేసి కట్టేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఇంటి యజమానిపై ఆ ఇంట్లో పనిచేసేవాళ్లే దాడిచేసి భారీ దోపిడీకి పాల్పడ్డారు. హైదరాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని గన్‌రాక్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న ఆర్మీ రిటైర్డ్ కల్నల్ కెప్టెన్ గిరి ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో పనిచేసే నేపాల్‌కు చెందిన వ్యక్తే మరో నలుగురితో కలిసి ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసుల వివరాలు ప్రకారం.. కెప్టెన్ గిరి ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ వ్యక్తి, పథకం ప్రకారం మరో నలుగురు వ్యక్తులను ఇంట్లోకి తీసుకువచ్చాడు. అనంతరం ముఠా సభ్యులు గిరిపై కర్రలతో దాడి చేసి, ఆయన్ను కట్టేశారు. ఆ తర్వాత ఇంట్లోని బీరువాను పగులగొట్టి సుమారు రూ.50 లక్షల విలువైన సొత్తును దోచుకెళ్లారు. ఎదురింటివారు కాసేపటికి అనుమానం వచ్చి చూసి.. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 25 తులాలకు పైగా బంగారం, రూ. 23 లక్షల నగదును దుండగులు అపహరించినట్లు బాధితుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంట్లో పనిచేసే వ్యక్తి వివరాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దుర్గమ్మ ఆలయంలో అద్భుతం.. చూడటానికి రెండు కళ్ళు చాలవు
దాబాలో లంచ్ చేసి బ్యాగ్ మరిచిపోయిన కస్టమర్.. ఓపెన్ చేయగా
ఐ – బొమ్మ రవి కేసులో ట్విస్టులే ట్విస్టులు
ఇలాంటి కొడుకు పుట్టడం నా కర్మ !! ఐ – బొమ్మ రవి తండ్రి ఎమోషనల్
భార్య వల్ల కాదు.. చేసిన ఆ ఒక్క పొరపాటు వల్లే.. ఐ – బొమ్మ రవి దొరికిపోయాడు
మాయదారి ఉల్లి,వెల్లుల్లి.. 11 ఏళ్ల కాపురాన్నే కూల్చేసాయిగా!
జూ కీపర్‌పై ఎలుగుబంటి దాడి.. పాపం చివరికి
ఆ దేశం లో టీనేజర్లకు సోషల్ మీడియాను బ్యాన్..
పేద యువతికి పెళ్ళి చేసిన పల్లె.. ఇది కదా మానవత్వం అంటే..
అద్దె ఇల్లు కావాలంటూ వచ్చారు.. దొరికింది దోచుకుపోయారు..
ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..
వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు

