దాబాలో లంచ్ చేసి బ్యాగ్ మరిచిపోయిన కస్టమర్.. ఓపెన్ చేయగా
విజయవాడకు చెందిన పృథ్వీరాజ్ శ్రీకాకుళం దాబాలో రూ. 1.7 లక్షల నగదు ఉన్న బ్యాగు మర్చిపోయారు. వెంటనే డయల్ 112కు ఫోన్ చేయగా, ఆముదాలవలస పోలీసులు తక్షణమే స్పందించి బ్యాగును గుర్తించారు. తదనంతరం, ఎస్సై బాలరాజు బ్యాగును పృథ్వీరాజ్‌కు తిరిగి అప్పగించారు. ప్రజల భద్రతకు డయల్ 112 ప్రాముఖ్యతను ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఈ సమయస్ఫూర్తిని జిల్లా ఎస్పీ అభినందించారు.
విజయవాడలో నివాసం ఉండే గురుగుబెల్లి పృథ్వీరాజ్ అనే వ్యక్తి ఓ దాబాలో భోజనం చేసి తన బ్యాగు అక్కడే మర్చిపోయి వెళ్లిపోయాడు. ఆ బ్యాగులో ఏకంగా రూ. 1,70,800 ల నగదు ఉంది. బ్యాగు మర్చిపోయిన విషయం గుర్తు వచ్చిన వెంటనే సమయస్ఫూర్తితో అతను చేసిన పనికి పోగొట్టుకున్న డబ్బులు తిరిగి అతనికి దక్కాయి. పనిమీద విజయవాడ నుంచి శ్రీకాకుళం వచ్చిన పృధ్వీరాజ్ శనివారం తిరిగి విజయవాడకు వెళ్తూ.. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస దాటి రాయపాడు దగ్గర ఉన్న ఓ దాబాలో భోజనం చేశాడు. బిల్లు పే చేసి తిరిగి వెళ్లిపోయాడు. కొత దూరం వెళ్లిన తర్వాత తన చేతిలో బ్యాగ్ లేకపోవడం గమనించి పృధ్వీరాజ్ కంగారు పడ్డాడు. బ్యాగ్ దాబాలో మర్చిపోయిన సంగతి గుర్తుకొచ్చింది. అయితే అప్పటికే చాలా దూరం ప్రయాణించటంతో ఏం చేయాలో తెలియక కంగారుపడ్డాడు. వెంటనే ఓ ఐడియా వచ్చింది. మరుక్షణం డయల్ 112కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు పృథ్వీరాజ్. సమాచారం అందుకున్న వెంటనే ఆముదాలవలస పోలీసుస్టేషన్ సిబ్బంది కాలర్ తెలిపిన ప్రదేశంలో గాలింపు నిర్వహించగా, అతడి బ్యాగ్ అక్కడే ఉంది. వెంటనే ఆ సిబ్బంది దానిని పోలీస్ స్టేషన్‌లో అప్పగించి, పృధ్వీరాజ్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే పృధ్వీరాజ్ ఆముదాలవలస పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా, తగిన వివరాలు తీసుకున్న మీదట.. ఎస్సై బాలరాజు ఆ బ్యాగును యజమానికి అందించారు. పోయాయనుకున్న డబ్బులు తిరిగి రావటంతో పృధ్వీరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి .. సదరు 112 సిబ్బందిని అభినందించారు. పోలీసు శాఖకు డయల్ 112 ద్వారా వచ్చే ప్రతి కాల్‌ను అత్యవసరంగా పరిగణించి ప్రజల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐ – బొమ్మ రవి కేసులో ట్విస్టులే ట్విస్టులు
ఇలాంటి కొడుకు పుట్టడం నా కర్మ !! ఐ – బొమ్మ రవి తండ్రి ఎమోషనల్
భార్య వల్ల కాదు.. చేసిన ఆ ఒక్క పొరపాటు వల్లే.. ఐ – బొమ్మ రవి దొరికిపోయాడు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

