AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీతా అంబానీ వాడే టీ కప్పుల ఖరీదెంతో తెలుసా ??

నీతా అంబానీ వాడే టీ కప్పుల ఖరీదెంతో తెలుసా ??

Phani CH
|

Updated on: Nov 17, 2025 | 5:32 PM

Share

ముఖేష్ అంబానీ నివాసం ఆంటిలియాలోని వంటగది గురించి మీకు తెలుసా? నీతా అంబానీ శ్రీలంక నుండి ప్రత్యేకంగా రూ.15 కోట్లకు పైగా విలువైన నోరిటేక్ పింగాణీ పాత్రలను కొనుగోలు చేశారు. 22 క్యారెట్ల బంగారం, ప్లాటినంతో తయారైన ఈ ఖరీదైన టీ కప్పులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ధరల వ్యత్యాసం కారణంగా శ్రీలంకలో కొనుగోలు చేసి, ప్రైవేట్ జెట్‌లో తెప్పించుకున్నారు. ఇది అంబానీ కుటుంబ లగ్జరీ జీవనశైలికి నిదర్శనం.

అంబానీస్‌ ఇల్లంటే ఆ మాత్రం ఉంటుంది మరి. అంత ఖరీదైన ఇంట్లో ఫర్నీచర్‌, ఇంటీరియర్‌ కూడా ఖరీదైనవే ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖేష్ అంబానీకి చెందిన ఇల్లు ఆంటిలియా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. ఇంటి ప్రతి మూలను ప్రపంచ స్థాయికి తీర్చిదిద్దారు. అసమానమైన సౌకర్యాలతో అమర్చారు. వంటగది విషయంలో కూడా అంబానీ కుటుంబం రాజీపడలేదు. దశాబ్దంన్నర క్రితం ఆంటిలియాకు వెళ్లే ముందు నీతా అంబానీ వంటగదిని సిద్ధం చేయించారు. నీతా ప్రైవేట్ జెట్‌లో శ్రీలంకకు వెళ్లి మరీ వంటగదికి అవసరమైన పాత్రలను కొనుగోలు చేశారట. అందుకు ప్రత్యేక కారణం ఉంది. శతాబ్దాలకు పైగా సంప్రదాయం కలిగిన జపనీస్ పింగాణీ తయారీదారు నోరిటేక్ బ్రాండ్ నుండి ప్రత్యేకమైన ఉత్పత్తులను ఎంచుకోవడమే నీతా లక్ష్యం. నోరిటేక్ బ్రాండ్ 22 క్యారెట్ల బంగారం, ప్లాటినంతో తయారు చేసిన పింగాణీ పాత్రలకు ప్రసిద్ధి చెందింది. శ్రీలంక నుండి నీతా కొనుగోలు చేసిన టీ కప్పులు బంగారంతో తయారు చేయబడిన ప్రత్యేక డిజైన్లను కలిగి ఉన్నాయి. ఒక టీ కప్పు ధర దాదాపు 3600 డాలర్లు అంటే ఇండియన్‌ కరెన్సీలో రూ. 3 లక్షలకు పైమాటే. అలాంటి టీ కప్పులు ఉన్న సెట్‌ను నీతా రూ. 15 కోట్లకు పైగా ఖర్చు చేసి కొనుగోలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. వంటగదికి అవసరమైన టీ సెట్‌ను శ్రీలంక నుండి కొనుగోలు చేసి ప్రైవేట్ జెట్ ద్వారా ముంబైకి తీసుకువచ్చారు. ఆంటిలియా సమీపంలో నోరిటేక్ బ్రాండ్ స్టోర్ ఉన్నప్పటికీ, ధర వ్యత్యాసాన్ని పరిగణనలోకి తీసుకుని శ్రీలంక నుండి నేరుగా కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారట నీతా. నోరిటేక్ అతిపెద్ద తయారీ కేంద్రం శ్రీలంకలో ఉంది. బంగారం, ప్లాటినంతో అలంకరించిన 50 సెట్స్‌తో కలిగిన నోరిటేక్ డిన్నర్ సెట్ భారతదేశంలో కొనాలంటే 800 డాలర్ల నుంచి 2,000 డాలర్ల మధ్య ఖర్చవుతుంది. శ్రీలంక నుండి కొనుగోలు చేసినప్పుడు దాని ధర 300 డాలర్ల నుండి 500 డాలర్లు మాత్రమే. ఈ విధంగా నీతా తక్కువ ధరకు కొనుగోలు చేయగలిగారు. కుటుంబ సభ్యులతో పాటు ఆంటిలియాలో 600 మంది సిబ్బంది కూడా ఇక్కడ భోజనం వండుతారు. ఈ వంటగది అత్యాధునిక సాంకేతిక పరికరాలు, సాంప్రదాయ వంట పద్ధతుల కలయికతో అమర్చబడి ఉంది. శాఖాహార ఆహారాన్ని మాత్రమే తయారు చేసినప్పటికీ, భారతీయ, విదేశీ శైలులను అవలంబిస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నదిలో శివలింగం, నంది దర్శనం.. శివయ్యే వచ్చాడంటూ

వంటచేసేందుకు కిచెన్‌లోకి వెళ్లిన మహిళ.. అక్కడ సీన్‌ చూసి షాక్

మన ఖర్మ బాగాలేకపోతే.. ఇంతేనేమో ??

వామ్మో…అక్కడికెలా వెళ్లావురా సామీ !!

EPF: పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పన్ను కట్టాలా ??