AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో...అక్కడికెలా వెళ్లావురా సామీ !!

వామ్మో…అక్కడికెలా వెళ్లావురా సామీ !!

Phani CH
|

Updated on: Nov 17, 2025 | 5:11 PM

Share

బెంగళూరు జలహళ్లి క్రాస్ వద్ద ఓ వ్యక్తి ఫ్లైఓవర్‌ పిల్లర్‌పై హాయిగా నిద్రపోవడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. ఈ వింత ఘటనను చూసి ప్రజలు షాకయ్యారు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని సురక్షితంగా కిందకు దించే ప్రయత్నం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, ఆ వ్యక్తి నిరాశ్రయుడా లేదా మత్తులో ఉన్నాడా అనే చర్చ నడుస్తోంది.

కొందరు వ్యక్తులు మద్యం మత్తులోనో, మతిస్థిమితం లేకనో చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. అసలు తాము ఏంచేస్తున్నారో..ఎక్కడున్నారో కూడా తెలియనట్టుగా ఉంటుంది వారి ప్రవర్తన. తాజాగా అలాంటి ఘటనే కర్నాటకలో జరిగింది. ఓ వ్యక్తి ఫ్లైఓర్‌ పిల్లర్‌ కింద చేరి నిద్రపోయాడు. అతన్ని చూసి స్థానికులు షాకయ్యారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. జలహళ్లి క్రాస్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ స్తంభంపై ఉన్న ఖాళీ ప్రదేశంలోకి వెళ్లి ఓ వ్యక్తి అక్కడ హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు. అదేదో తన సొంత ఇంట్లో బెడ్‌పై నిద్రపోతున్నట్టుగా పడుకొని ఉన్నాడు. ఆ రోడ్డుపై వెళ్లే వాహనదారులు, జనం ఇది చూశారు. కొందరు వ్యక్తులు అక్కడ గుమిగూడారు. ఏం జరుగుతుందో తెలియక వారు అయోమయంలో పడ్డారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్తలికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని కిందకు దించేందుకు ప్రయత్నించారు. అసలు ఆ వ్యక్తి ఫ్లైఓవర్‌ పిల్లర్‌ పైకి ఎలా వెళ్లాడో ఎవరికీ అంతుపట్టలేదు. ఈ ఘటన వీడియోతీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ప్రమాదకరంగా ఉన్న అక్కడకు అతడు చేరుకోవడాన్ని కొందరు విమర్శించారు. అయితే ఆ వ్యక్తి నిరాశ్రయుడై ఉంటాడని, అందుకే అక్కడ తలదాచుకుంటున్నట్లు కొందరు, వర్కర్‌ కావచ్చని మరికొందరు అభిప్రాయపడ్డారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

EPF: పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పన్ను కట్టాలా ??

తొక్కే కదా అని లైట్‌ తీసుకోకండి.. ఇలా వాడి చూడండి

ఈ జనం మారరా ?? కోట్లాది మంది పాస్‌వర్డ్‌ ఒకటే !!

రూ.20 వేలా ?? ఐఫోన్‌ పౌచ్‌పై ట్రోలింగ్‌

మీ కళ్లు చెబుతాయి ఇక.. మీ వ్యాధులేమిటో !!