EPF: పీఎఫ్ విత్‌డ్రా చేస్తే పన్ను కట్టాలా ??
కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ విత్‌డ్రాను మొబైల్ ద్వారా సులభతరం చేసింది. అయితే, పన్ను నియమాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. ఐదేళ్లలోపు విత్‌డ్రా చేస్తే పన్ను వర్తిస్తుంది, యజమాని వాటాపై పన్ను ఉంటుంది. పాన్ లేకుంటే టీడీఎస్ ఎక్కువ. ఐదేళ్లకు మించి పాత పన్ను విధానంలో రూ.1.5 లక్షల వరకు మినహాయింపు, కొత్త విధానంలో యజమాని వాటాపై మాత్రమే. అత్యవసరమైతే తప్ప విత్‌డ్రా చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
ఉద్యోగ భవిష్య నిధి ఈపీఎఫ్ లోని సొమ్మును విత్ డ్రా చేసుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఈపీఎఫ్ ఆఫీసు దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా మొబైల్ ఫోన్ ద్వారా విత్ డ్రా చేసుకునే సదుపాయం కల్పించింది. విత్ డ్రాకు ఉన్న పరిమిత ఆప్షన్లకు మరికొన్నింటిని జోడించింది. దీంతో పీఎఫ్ విత్ డ్రా చేసుకోవడం మరింత ఈజీగా మారింది. అయితే, ఇలా విత్ డ్రా చేస్తున్న సొమ్ముకు పన్ను చెల్లించాలా.. అంటే అక్కర్లేదనే నిపుణులు చెబుతున్నారు. అయితే, భవిష్యత్ అవసరాల కోసం దాచుకునే ఈ సొమ్మును అత్యవసరమైతే తప్ప విత్ డ్రా చేయొద్దని కూడా వారు సూచిస్తున్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా నిబంధనలలో మార్పులు చేసింది. నిబంధనల ప్రకారం..ఉద్యోగంలో చేరిన ఐదేళ్లలోపు పీఎఫ్ నుంచి సొమ్ము విత్ డ్రా చేస్తే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగం మారిన సందర్భాలలో రెండు సంస్థల్లో పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. పాత సంస్థలో వినియోగించిన పీఎఫ్ ఖాతాను కొత్త సంస్థకు బదిలీ చేసిన సందర్భంలోనే ఈ రూల్ వర్తిస్తుంది. కొత్త ఖాతా తెరిస్తే మళ్లీ మొదటి నుంచే లెక్కిస్తారు. ఈపీఎఫ్ లో యజమాని వాటా కింద జమ అయిన మొత్తంతో పాటు డిపాజిట్ పై వడ్డీకి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగి ఆదాయాన్ని బట్టి పన్ను శ్లాబు వర్తిస్తుంది. ఆదాయపు పన్ను శాఖకు పాన్ కార్డు వివరాలు సమర్పించకపోతే 34.60 శాతం టీడీఎస్ కట్ అవుతుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం..ఐదేళ్లకు మించిన ఈపీఎఫ్ ఖాతాల్లోని డిపాజిట్ మొత్తంలో రూ.1.50 లక్షల వరకు పాత పన్ను విధానంలో పన్ను మినహాయింపు పొందొచ్చు. కొత్త పన్ను విధానంలో కేవలం యజమాని వాటాపై మాత్రమే మినహాయింపు లభిస్తుంది. రెండు విధానాల్లోనూ ఈపీఎఫ్ ఖాతాలోని నగదు నిల్వలు, మెచ్యూరిటీ సొమ్ము పూర్తిగా పన్ను రహితం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తొక్కే కదా అని లైట్ తీసుకోకండి.. ఇలా వాడి చూడండి
ఈ జనం మారరా ?? కోట్లాది మంది పాస్‌వర్డ్ ఒకటే !!
రూ.20 వేలా ?? ఐఫోన్ పౌచ్‌పై ట్రోలింగ్
నిజాయితీ చాటుకున్న చిరుద్యోగి.. అంత డబ్బు ఎలా తిరిగి ఇచ్చేశావమ్మా
మంగళగిరి ఎయిమ్స్‌లో అద్భుతం.. తెగిపడిన చెయ్యిని అతికించారు
ఇంటి పైకప్పు చీల్చుకుంటూ దూసుకొచ్చిన ఉల్క..
గల్ఫ్ బావుల నుంచి భారత్ కు ఆయిల్ ఎలా వస్తుందో తెలుసా ?
పోలీసుల ముందే పొట్టు.. పొట్టు.. కొట్టుకున్న భార్యాభర్తలు
కాలువలో కొట్టుకొచ్చిన నోట్ల కట్టలు.. కట్ చేస్తే..
ఉద్యోగాల వేట వద్దు.. స్వయం ఉపాధే ముద్దు

