రూ.20 వేలా ?? ఐఫోన్ పౌచ్‌పై ట్రోలింగ్
యాపిల్ కొత్తగా 'ఐఫోన్ పాకెట్' పేరుతో రూ.20,000 విలువైన పౌచ్‌ను విడుదల చేసింది. ఇది ఐఫోన్‌తో పాటు చిన్న వస్తువులు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. అయితే, దీని అధిక ధరపై సోషల్ మీడియాలో విమర్శలు, ఫన్నీ కామెంట్లు వెల్లువెత్తాయి. ఏఐ వంటి సాంకేతికతలపై ఇతర కంపెనీలు దృష్టి పెడుతుంటే, యాపిల్ ఇలాంటి ఖరీదైన యాక్సెసరీతో వచ్చిందని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
యాపిల్ ఓ కొత్త ప్రొడక్ట్‌ను లాంచ్ చేసింది. అయితే ఈసారి ఏ ఐఫోనో.. ట్యాబో కాదు.. ఐఫోన్ క్యారీ చేసేందుకు ఒక పౌచ్‌ను తీసుకొచ్చింది. ‘ఐఫోన్ పాకెట్ ’ పేరిట కొత్త హై-ఫ్యాషన్డ్ యాక్సెసరీని విడుదల చేసింది. ఈ నిట్టెడ్ పౌచ్ ధర 229 డాలర్లుగా నిర్ణయించింది. అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ.20 వేలు. దీనిపై సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లు, విమర్శలు కామెంట్ల రూపంలో వస్తున్నాయి.ఇది ఏ ఫోన్ మోడల్‌కైనా సరిపోతుందని, ఇందులో ఐఫోన్‌తో పాటు మరికొన్ని చిన్న వస్తువులూ పెట్టుకోవచ్చని కంపెనీ తెలిపింది. దీన్ని చేత్తో పట్టుకోవచ్చు, బ్యాగ్‌కి కట్టుకోవచ్చు, బ్యాగ్‌లా ధరించవచ్చని చెప్పింది. ‘ఇది సింపుల్, క్రియేటివ్ యాక్సెసరీ. మా అన్ని ఐఫోన్ మోడల్స్, కలర్స్‌కి సరిపోయేలా దీన్ని రూపొందించాం’ అని యాపిల్ ఇండస్ట్రియల్ డిజైన్ వైస్ ప్రెసిడెంట్ మోలీ ఆండర్సన్ తెలిపారు. నవంబర్ 14 నుంచి ఫ్రాన్స్, చైనా, ఇటలీ, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, యూకే, అమెరికా వంటి దేశాల్లో ఎంపిక చేసిన యాపిల్ స్టోర్లతో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది. ఇది రెండు వెర్షన్స్‌లో లభించనుంది. ‘కంపెనీ ఏ ప్రొడక్ట్‌ను విడుదల చేసినా సమర్థించే యాపిల్ అభిమానులకు ఇదొక పరీక్ష’ అంటూ ఓ యూట్యూబర్ రాసుకొచ్చారు. ఇతర టెక్ కంపెనీలు ఏఐ మోడల్స్‌ను అభివృద్ధి చేస్తుంటే యాపిల్ సాక్స్‌తో ఆటలాడుతోందని మరో యూజర్ కామెంట్ చేసారు. ‘నా ఫోన్ విలువ కూడా ఇంతలేదు మావ!’ అంటూ మరికొందరు యూజర్లు ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ కళ్లు చెబుతాయి ఇక.. మీ వ్యాధులేమిటో !!
తండ్రి ఆస్తి కోసం కరిష్మా కపూర్ కూతురి గొడవ కోర్టు అసహనం
అవి అశ్లీలమైన ఫోటోలు.. నా కొడుకు చూస్తే ఎలా ?? దయచేసి తొలగించండి
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

