అవి అశ్లీలమైన ఫోటోలు.. నా కొడుకు చూస్తే ఎలా ?? దయచేసి తొలగించండి
మరాఠీ నటి గిరిజా ఓక్ ఇంటర్వ్యూతో అనూహ్యంగా వైరల్ అయ్యారు. ప్రజాదరణ పెరిగినా, AI సాయంతో తన ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్న కొందరు వ్యక్తులపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన 12 ఏళ్ల కొడుకు భవిష్యత్తులో ఈ చిత్రాలను చూస్తే ఎలా అని ఆందోళన చెందారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని, ఫోటోలను తొలగించాలని అభ్యర్థించారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీల వ్యక్తిగత భద్రతపై ఇది ప్రశ్నలను లేవనెత్తుతోంది.
సోషల్ మీడియాలో ఎప్పుడు.. ఎవరు ఎందుకు వైరల్ అవుతారో ఎవరూ చెప్పలే. ఊహించలేం! అలా అనుకోకుండా వైరల్ అవుతున్నారు మరాఠా బ్యూటీ గిరజా ఓక్. దాదాపు ఇండస్ట్రీలో 20 ఏళ్ల క్రితం కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె.. ఇప్పుడు అనూహ్యంగా ఓ ఇంటర్వ్యూ కారణంగా వైరల్ అయింది. విపరీతమైన క్రేజ్‌ను తెచ్చుకుంది. దాంతో పాటే వచ్చిపడిన ట్రోల్స్ అండ్ అశ్లీల క్రియేటర్ కారణంగా ఇప్పుడు బాధపడుతోంది. తన కొడుకును తలుచుకుని ఎమోషనల్ అవుతోంది. తాజాగా ఓ హిందీ ఇంటర్వ్యూలో పాల్గొన్న మరాఠీ నటి గిరిజా ఓక్.. తన గురించి పలు విషయాలు చెప్పింది. ‘కాంతార 1’ ఫేమ్ గుల్షన్ దేవయ్య.. తనతో ఓ రొమాంటిక్ సీన్ చేస్తున్నప్పుడు నువ్వు ఓకేనా అని 17 సార్లు తనని అడిగాడని, అలాంటి యాక్టర్స్‌తో కలిసి పనిచేస్తున్నప్పుడు చాలా సౌకర్యంగా ఉంటుందని గిరిజా చెప్పుకొచ్చింది. ఈ బిట్‌తో పాటు ఇంటర్వ్యూకి సంబంధించిన పలు వీడియో క్లిప్స్ ట్విటర్‌లో తెగ కనిపిస్తున్నాయి. స్కై బ్లూ చీరలో గిరిజా ఓకే చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ.. నెటిజన్లు ఎందుకో ఈమెని చూసి ఫిదా అయిపోయినట్లు ఉన్నారు. అందుకే ఫొటోలు, వీడియోలు వైరల్ చేశారు. ఈ క్రమంలోనే కొందరు అళ్లీల క్రియేటర్లు ఏఐ సాయంతో ఈమెను ఎక్స్‌పోజ్ చేస్తున్నారు. ఇక ఇది గమనించిన గరిజా తాజాగా సోషల్ మీడియా వేదికగా రియాక్టైంది. ఇలా సడన్‌గా వైరల్‌గా మారడంపై సంతోషం వ్యక్తం చేసిన గిరిజ… తన ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారని తెలుసుకుని షాకయ్యానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది. ఆన్‌లైన్‌లో తనకు వస్తున్న సడన్ అటెన్షన్ చూసి షాకైపోయానని.. చాలామంది తనను ఎంతగానో ప్రేమిస్తున్నారని.. గ్యాప్ లేకుండా ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వస్తూనే ఉన్నారని తన వీడియోలో గిరిజా చెప్పుకొచ్చింది. ఈ ప్రేమ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని.. కొన్ని మీమ్స్ చూస్తుంటే భలే సరదాగా ఉన్నాయంది. కానీ కొన్ని మీమ్స్‌లో కొందరు మాత్రం ఏఐ ను ఉపయోగించి తన ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారని.. అవి చూడటానికి కూడా చాలా అసౌకర్యంగా ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఎడిటింగ్స్ అస్సలు బాగోలేవని చెప్పుకొచ్చింది. ఈక్రమంలోనే తనకు 12 ఏళ్ల కొడుకున్నాడని చెప్పిన గిరిజా.. ప్రస్తుతానికైతే వాడు సోషల్ మీడియా వాడడు. కానీ, రేప్పొద్దున వాడు కూడా ఈ ఆన్‌లైన్ ప్రపంచంలో అడుగుపెట్టక.. తన మార్ఫింగ్ ఫోటోలు చూస్తే ఏంటని ప్రశ్నించింది. మా అమ్మ అభ్యంతరకర ఫోటోలు సోషల్ మీడియాలో ఉన్నాయేంటి? అని వాడు బాధపడతాడన్న ఆలోచనే తనను మరింత ఆందోళనకు గురి చేస్తోందంటూ చెప్పుకొచ్చింది. వ్యూస్ కోసమే కొందరు అసభ్య ఫోటోలు సృష్టిస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు. ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోండి. ఒకమ్మాయి ఫోటోలను ఇలా ఎడిట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. దయచేసి వాటిని రిమూవ్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సినిమా నుంచి యూటర్న్ !! లోగుట్టు ఏమై ఉంటుంది ??
థియేటర్ లో చున్నీ వివాదంపై నోరు విప్పిన డైరెక్టర్
రెండో సినిమాకు చరణ్.. మూడో సినిమాకు షారుఖ్
Akhanda 2: బాలయ్య సినిమాకూ అవే కష్టాలు ?? కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్
Prabhas: డ్యాన్స్ మాస్టర్‌కు .. గొప్ప ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

