తండ్రి ఆస్తి కోసం కరిష్మా కపూర్ కూతురి గొడవ కోర్టు అసహనం
దివంగత సంజయ్ కపూర్ ఆస్తుల కోసం కరిష్మా కపూర్ పిల్లలు సమైరా, కియాన్ న్యాయపోరాటం చేస్తున్నారు. కాలేజీ ఫీజులు చెల్లించలేదని సమైరా చేసిన వాదనపై ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 'మెలోడ్రామాలు వద్దు' అని కోర్టు హెచ్చరించింది. ప్రియా కపూర్ తరపు న్యాయవాది, అన్ని ఖర్చులు చెల్లించామని వాదించారు. ఈ వివాదం తదుపరి విచారణకు వాయిదా పడింది.
కరీష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కుమార్ ఆస్తి వ్యవహారం ఢిల్లీ కోర్టులో విచారణకు వచ్చింది. తమ తండ్రి దివంగత సంజయ్ కపూర్ ఆస్తుల్లో వాటా కోసం కరిష్మా కపూర్ కుమార్తె, కుమారుడు సమైరా, కియాన్ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే విచారణ సందర్భంగా రెండు నెలలుగా తన ఫీజులు కట్టలేదని కరీష్మా కపూర్ కుమార్తె హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. దీంతో కోర్టు కాస్త అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి మెలోడ్రామాలు చేయవద్దంటూ సమైరాను.. ఆమె తరుపు న్యాయవాదిని న్యాయస్థానం హెచ్చరించింది. నటి కరిష్మా కపూర్ పిల్లల తరపున వాదిస్తున్న న్యాయవాది మహేష్ జెఠ్మలానీ.. సమైరాకు రెండు నెలలుగా కాలేజీ ఫీజు చెల్లించలేదని కోర్టుకు విన్నవించాడు. చట్టప్రకారం పిల్లల ఖర్చులను తండ్రిగా సంజయ్ భరించాల్సి ఉంటుందంటూ వాదించాడు. ఈ క్రమంలోనే కరిష్మా పిల్లల వాదనను ప్రియా కపూర్ సవాలు చేశారు. అమెరికాలో చదువుతున్న కరిష్మా పిల్లలకు సంబంధించి రెండు నెలల ఫీజు చెల్లించలేదనేది పూర్తిగా అవాస్తవమని ప్రియా కపూర్ తరపున న్యాయవాది రాజీవ్ నాయర్ కోర్టులో తన వాదనలు వినిపించాడు. పిల్లలకు ఇవ్వాల్సిన ఆస్తి, వారి చదువులకు కావాల్సిన అన్ని ఖర్చులను తన క్లైంటు ప్రియా ఇప్పటికే ఇచ్చేసిందన్నాడు.ఇరువురి వాదనలు విన్న న్యాయస్తానం కరిష్మా కూతురి పై అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి మెలోడ్రామాలు వద్దంటూ హెచ్చరించింది. పిల్లలకు ఫీజులు కట్టలేదనే స్టేట్‌మెంట్స్ ఇవ్వద్దని కరిష్మా కపూర్ కుమార్తెకు న్యాయస్థానం సూచించింది.ఇలాంటి అంశాలు మళ్లీ కోర్టు ముందుకు రాకుండా చూసుకోవాలంటూ చెప్పింది. అంతేకాదు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అవి అశ్లీలమైన ఫోటోలు.. నా కొడుకు చూస్తే ఎలా ?? దయచేసి తొలగించండి
సినిమా నుంచి యూటర్న్ !! లోగుట్టు ఏమై ఉంటుంది ??
థియేటర్ లో చున్నీ వివాదంపై నోరు విప్పిన డైరెక్టర్
రెండో సినిమాకు చరణ్.. మూడో సినిమాకు షారుఖ్
Akhanda 2: బాలయ్య సినిమాకూ అవే కష్టాలు ?? కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

