థియేటర్ లో చున్నీ వివాదంపై నోరు విప్పిన డైరెక్టర్
ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా ప్రమోషనల్ చున్నీ వీడియో వివాదంపై దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్పందించారు. థియేటర్‌లో జరిగిన సంఘటన యాదృచ్ఛికం, పీఆర్ స్టంట్ కాదని స్పష్టం చేశారు. మహిళలు చున్నీ తీసి భావ వ్యక్తీకరణ చేస్తే విమర్శించడం బాధాకరమని, పురుషులు చొక్కాలు తీసేస్తే ప్రశ్నించరని పేర్కొంటూ ట్రోలర్స్‌కు చురక అంటించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇప్పుడు సినిమా తెరకెక్కించడం కాదు.. తెరకెక్కించిన సినిమాను ప్రమోట్ చేసుకోవడమే అతి ముఖ్యమే. అందుకే ఈ ముఖ్యమైన పనికోసం మేకర్స్ అందరూ పీఆర్ వెంట పడుతున్నారు. వాళ్లు డిజైన్ చేసిన ప్రమోషనల్ ఫ్రేమ్ వర్క్‌లో నడుస్తూ తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటుంన్నారు. ఈ క్రమంలోనే కొన్ని సార్లు అనుకోని చిక్కుల్లో పడి.. వివరణ ఇచ్చే వరకు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న చున్నీ వీడియోకు క్లారిటీ ఇచ్చాడు. ఓ సుదీర్ఘ నోట్‌ను తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేశాడు. ఇక అసలు మ్యాటర్‌లోకి వెళితే.. రాహుల్ రవింద్రన్ డైరెక్షన్లో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేసిన మూవీ ది గర్ల్‌ఫ్రెండ్. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. ప్రత్యేకంగా మహిళా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలోని క్లైమాక్స్ చాలా మందిని భావోద్వేగానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో, క్లైమాక్స్ సీన్ చూసిన ఒక యువతి థియేటర్‌లో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ను కలిసి, తన చున్నీని తీసేసి ఎమోషనల్‌గా మాట్లాడింది. అయితే ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. ఈ మూవీ మేకర్స్ కూడా అఫీషియల్‌గా ఈ వీడియోను షేర్ చేయడంతో.. మరింతగా నెట్టింట ట్రెండ్ అయింది. దాంతోపాటే ఉమెన్ ఎంపవర్ మెంట్ అంటే అమ్మాయి చున్నీ తీసేయడం కాదనే కామెంట్ వచ్చింది. కొందరు సెలబ్రిటీలు కూడా ఈ వీడియో గురించి సెటైరికల్‌గా మాట్లాడడం కూడా వివాదంగా మారింది. దీంతో దీనిపై తాజాగా డైరెక్టర్ రియాక్టయ్యాడు. థియేటర్‌లో జరిగిన సంఘటన పూర్తిగా యాదృచ్ఛికమంటూ తన పోస్టులో రాసుకొచ్చాడు. ఇది PR స్టంట్ కాదని చెప్పాడు. మొదట ఆ వీడియో షేర్ చేయాలంటే తనకు కూడా భయమేసిందని.. కానీ ఈ తర్వత షేర్ చేశానంటూ చెప్పాడు. అంతేకాదు ఎవరినీ దుపట్టా తీసేయమని సినిమా చెప్పడం లేదంటూ ట్రోల్ చేసే వారికి క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు ఫైనల్‌గా ట్రోలర్స్‌కు చురక కూడా అంటించాడు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. పండగల్లో, క్రీడా వేడుకల్లో… మగాళ్లు ఆనందంతో చొక్కాలు తీసేసినా.. ఎవరూ ప్రశ్నించరని.. కానీ మహిళలు మాత్రం చున్నీ తీసేసి భావ వ్యక్తీకరణ చూపితే మాత్రం ‘సంస్కృతి’ పేరుతో విమర్శలు చేయడం బాధాకరం అంటూ తన పోస్టులో రాసుకొచ్చాడు ఈ డైరెక్టర్ . ప్రస్తుతం ఈయన చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెండో సినిమాకు చరణ్.. మూడో సినిమాకు షారుఖ్
Akhanda 2: బాలయ్య సినిమాకూ అవే కష్టాలు ?? కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్
Prabhas: డ్యాన్స్ మాస్టర్‌కు .. గొప్ప ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్
White Hair: తెల్ల జుట్టు మంచిదే.. క్యాన్సర్ ను అడ్డుకుంటుందట
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

