సమోసా తింటున్నారా.. తప్పనిసరిగా ఇలా చేయండి.. లేదంటే
సాయంత్రం పూట తినే స్నాక్స్‌లో దాగివున్న కేలరీలపై అవగాహన ముఖ్యం. సమోసా, వడపావ్ వంటి వాటిలో 250-300 కేలరీలుంటాయి. వీటిని కరిగించడానికి గంటకు పైగా నడవాల్సి ఉంటుంది. కేలరీలను గుర్తించి, వాటిని బర్న్ చేయకపోతే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి ఆరోగ్య సమస్యలు వస్తాయి. నిపుణుల సలహాతో ఆరోగ్యంగా ఉండండి.
చాలా మంది సాయంత్రం కాగానే స్నాక్స్ తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. తమకు రుచిగా అనిపించే స్నాక్స్ ఇంట్లో తయారు చేసుకునే వారు కొందరైతే.. ఆఫీసు నుంచి బయటికొచ్చి టీతో పాటు సమోసా కొనుక్కొని తినే వారు మరికొందరు. ఎక్కువ మంది స్వీట్లు, చిప్స్, సమోసా వంటివి తింటుంటారు. అయితే, ఆహారంగా ఏది ఏ సమయంలో తీసుకున్నా అవి తినడం వల్ల వచ్చే కేలరీలను కరిగించడానికి ఏం చేస్తున్నారో కూడా ముఖ్యమే అంటున్నారు నిపుణులు. అవును.. ఎందుకంటే మనం తినే ఆహారంలో ఏది ఎన్ని క్యాలరీలు ఇస్తుందో తెలుసుకోవాలి. లేకపోతే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే మీరు ఇష్టంగా తినే ఆహారాలలో ఎన్ని క్యాలరీలు ఉంటాయి? వాటిని కరిగించడానికి ఎంత నడవాలి? అనే వివరాలను ముంబైకి చెందిన ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మనన్ వోరా తన ఇన్‌స్టాలో ఓ వీడియో పంచుకున్నారు. ఒక సమోసా లేదా వడపావ్ లో 250 క్యాలరీలుంటాయి. కరిగించడానికి 50 నిమిషాలు నడవాలి. చిప్స్ ప్యాకెట్ లో 300 క్యాలరీలు కరిగించడం కోసం గంటకు పైగా నడక అవసరం. గులాబ్ జామున్లో 180 క్యాలరీలు ఉంటాయి కాబట్టి 35 నిమిషాలు నడవాలి. ప్లేట్ చోలే భతురేలో ఉండే 600 క్యాలరీల కోసం ఏకంగా 2 గంటలు నడవాల్సి ఉంటుందని సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దెయ్యాన్ని చూసి భయపడిన ఎలుగుబంటి ఏం చేసిందంటే.. మస్త్ ఫీల్ ఉంది మామా
బంగాళాఖాతంలో అల్పపీడనం..దంచికొట్టనున్న వర్షాలు !!
World Largest Spider Web: అద్భుతం.. ప్రపంచంలోనే అతి పెద్ద సాలెగూడు..
Stonefishes: సముద్రపు అడుగున జీవించే అరుదైన చేప.. దీని సొగసు చూడతరమా
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

