బంగాళాఖాతంలో అల్పపీడనం..దంచికొట్టనున్న వర్షాలు !!
ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన ఉంది. ఇప్పటికే చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో, వర్షాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారులను అప్రమత్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి వానముప్పు తప్పేలా లేదు. ఓవైపు చలి చంపేస్తుంటే..మరోవైపు వర్షాలు కురుస్తాయంటూ వాతావరణశాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్రంలో రాబోయే రెండు రోజులలో ఏపీలో పలు చోట్ల వర్షాలు దంచికొట్టనున్నట్టు వెల్లడించారు. వాతావరణశాఖ అధికారుల ప్రకారం.. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నెమ్మదిగా కదులుతోందని ఐఎండీ తెలిపింది. వీటి ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బుధవారం వరకు తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అల్పపీడన ప్రభావంతో ప్రధానంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. బలమైన ఈదురు గాలుల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల కనిష్ఠ స్థాయికి పడిపోతుండగా, మరికొన్ని చోట్ల 35 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల మధ్య ఇప్పుడు వర్ష సూచన రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
World Largest Spider Web: అద్భుతం.. ప్రపంచంలోనే అతి పెద్ద సాలెగూడు..
Stonefishes: సముద్రపు అడుగున జీవించే అరుదైన చేప.. దీని సొగసు చూడతరమా
ఆ నాలుగు కారణాల వల్లే 99శాతం మందిలో గుండెపోటు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో

