AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda 2: బాలయ్య సినిమాకూ అవే కష్టాలు ?? కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్‌

Akhanda 2: బాలయ్య సినిమాకూ అవే కష్టాలు ?? కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్‌

Phani CH
|

Updated on: Nov 17, 2025 | 2:27 PM

Share

స్టార్ హీరోల సినిమాలకు రిలీజ్ డేట్ కష్టాలు పెరిగాయి. సాధారణంగా బాలకృష్ణ సినిమాలు అనుకున్న సమయానికే వస్తాయి. కానీ, 'అఖండ 2' విడుదల వాయిదా పడింది. సెప్టెంబర్ 25 నుండి డిసెంబర్ 5కు, ఇప్పుడు అది కూడా తప్పేలా ఉంది. షూటింగ్, సీజీ వర్క్ పెండింగ్ ఉండటమే కారణం. ఈ అనూహ్య ఆలస్యం బాలయ్య అభిమానులను నిరాశపరిచింది, వారు చిత్రబృందం నుండి స్పష్టత కోరుతున్నారు.

ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలకు రిలీజ్‌ డేట్‌ కష్టాలు చుట్టుముట్టుతున్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు ఓ రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేసిన మేకర్స్. ఆ డేట్‌కు తమ సినిమాను రిలీజ్‌ చేయలేక.. అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ సాగదీసే పరిస్థితి ఇప్పుడు ఇండస్ట్రీలో కనిపిస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితులకు అతీతుడనే పేరుంది బాలయ్యకు. అనుకున్న టైంకే ఈ లయన్‌ సినిమాలు రిలీజ్‌ అవుతుంటాయి. బాలయ్య పెట్టిన ముహూర్తానికే ఆయన సినిమాలు బయటికి వస్తుంటాయి. అయితే అఖంగ2 విషయంలో ఇదే మిస్సవుతోంది. బోయపాటి డైరెక్షన్లో బాలయ్య హీరోగా చేస్తున్నమోస్టు అవేటెడ్ మూవీ అఖండ2. అఖండ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ ఈసినిమా మొదట సెప్టెంబర్ 25న రిలీజ్‌ చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ షూటింగ్, అండ్ సీజీ వర్క్‌ పెండింగ్‌ ఉండడంతో.. రిలీజ్‌ను డిసెంబర్ 5కు వాయిదా వేశారు. ఇక డిసెంబర్ 5 రిలీజ్ డేట్ దగ్గర పడడంతో… రీసెంట్‌గా బోయపాటి ప్రమోషన్స్‌ను కూడా షురూ చేశాడు. ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్‌ చేశాడు. ఇందుకోసం ముంబయ్లో ఓ చిన్న ఈవెంట్‌ కూడా చేశారు. కానీ తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ మూవీ డిసెంబర్ 5న రిలీజ్‌ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది. మరో డేట్ కోసం ఈ మూవీ మేకర్స్ చూస్తున్నారని ఫిల్మ్ నగర్లో టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయంగా బాలయ్య ఫ్యాన్స్ కాస్త డిస్సపాయింట్ అవుతున్నారు. బాలయ్య సినిమాకు కూడా రిలీజ్‌ కష్టాలేనా? అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు ఈ న్యూస్ పై క్లారిటీ కావాలంటూ అఖండ2 మేకర్స్‌ను డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prabhas: డ్యాన్స్‌ మాస్టర్‌కు .. గొప్ప ఛాన్స్‌ ఇచ్చిన ప్రభాస్‌

White Hair: తెల్ల జుట్టు మంచిదే.. క్యాన్సర్ ను అడ్డుకుంటుందట

సమోసా తింటున్నారా.. తప్పనిసరిగా ఇలా చేయండి.. లేదంటే

దెయ్యాన్ని చూసి భయపడిన ఎలుగుబంటి ఏం చేసిందంటే.. మస్త్ ఫీల్ ఉంది మామా

బంగాళాఖాతంలో అల్పపీడనం..దంచికొట్టనున్న వర్షాలు !!