AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగార్జునకే షాకిచ్చిన తనూజ !! అతి అంటే ఇదే  మరి !!

నాగార్జునకే షాకిచ్చిన తనూజ !! అతి అంటే ఇదే మరి !!

Phani CH
|

Updated on: Nov 18, 2025 | 3:37 PM

Share

బిగ్‌బాస్ సీజన్ 9లో టైటిల్ రేసులో ఉన్న తనూజ గౌడ, నాగార్జునకు షాకిచ్చింది. హౌస్‌లో తనకు సపోర్ట్ లేదని ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తోటి హౌస్‌మేట్స్ సహాయం చేసినా, 'ఎవరూ సాయం చేయలేదు' అనడంతో నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. తనూజ గత వీడియోలను షేర్ చేస్తూ ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.

బిగ్‌బాస్ సీజన్ 9..! ఈసారి టైటిల్ రేసులో ముందున్న కంటెస్టెంట్ తనూజ గౌడ. ఎప్పుడూ అరుస్తూ.. ఎవరో ఒకరి అసహనం చూపించే తనూజ.. ఏకంగా కింగ్ నాగార్జునకే షాకిచ్చింది. తన ఆన్సర్‌తో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ కూడా అవుతోంది. నవంబర్ 15 వీక్ ఎండ్ ఎపిసోడ్‌లో… నాగార్జున అందరినీ ఒక కొశ్చన్ అడిగారు. హౌస్‌లో మీకు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉండే ఒకరి పేరు చెప్పండని అడగ్గా.. అందరూ తమను సపోర్ట్ చేసిన వారి పేర్లు చెబితే.. తనూజ మాత్రం తనకు అలాంటి వాళ్లు ఎవరూ లేరని.. తనను ఇప్పటి వరకు ఎవరూ సపోర్ట్‌ చేయలేదంటూ చెప్పి షాకిచ్చింది. ఇక తనూజ ఆన్సర్‌తో నాగార్జునతో పాటు అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ఎందుకంటే .. ముందు నుంచి భరణి, ఇమ్మాన్యుయేల్, రీతూ, సంజన, నిఖిల్, కళ్యాణ్ ఇలా దాదాపు హౌస్మేట్స్ అందరూ ఆమెకు సహయం చేసినవాళ్లే. కానీ నాకు సపోర్ట్ లేరంటూ తనూజ చెప్పడంతో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. దాంతో పాటే ఈమెపై విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. హౌస్ లో సపోర్ట్ కోసం పరిగెత్తే తనూజ.. తనకు సపోర్ట్ లేరని చెప్పడం వింతగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఆమె టాస్కులకు సంబంధించిన వీడియోస్ షేర్ చేస్తూ తనూజకు ఇచ్చిపడేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీడు సైకోకు ఏమాత్రం తక్కువ కాదు..

సాఫ్ట్ వేర్ CEO నుంచి ఐ – బొమ్మ వ్యవస్థాపకుడిగా

Kamal Haasan: కథ నచ్చలేదన్న రజనీ.. లోకనాయకుడు మాత్రం అతని రాకకోసం వెయిటింగ్‌

Chiranjeevi: కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో చిరు.. సరికొత్త లుక్ లో మెగాస్టార్

యానిమేషన్‌ ప్రధానంగా ప్రభాస్‌ – ప్రేమ్‌రక్షిత్‌ సినిమా

Published on: Nov 18, 2025 03:34 PM