యానిమేషన్ ప్రధానంగా ప్రభాస్ – ప్రేమ్‌రక్షిత్ సినిమా
ప్రభాస్ వరుసగా సినిమాలు ఓకే చేయడం, దర్శకులను నిరీక్షింపజేయడంపై పరిశ్రమలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలు భారీ చిత్రాలతో బిజీగా ఉన్న డార్లింగ్, రాజమౌళి, నాగ అశ్విన్, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో పాటు తాజాగా ప్రేమ్ రక్షిత్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఆయన పక్కా ప్రణాళికతోనే ముందుకు వెళ్తున్నారని, అయితే దర్శకులను వేచి చూడనివ్వడం సరైందేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అవకాశాలదేం ఉంది? అని తేలిగ్గా అనుకునేరు. ఓ హీరో ఓ కెప్టెన్‌ని నమ్మి చాన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు. మరి అంత పెద్ద విషయాన్ని డార్లింగ్ మాత్రం సో సింపుల్‌గా చేసేస్తున్నారేంటి? ఆయన కిట్టీలో ఉన్న సినిమాలు, ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తున్న డైరక్టర్లను గమనించిన వారు ఈ మాటలే అంటున్నారు. అన్నట్టు రీసెంట్‌గా ఫౌజీ సాంగ్ షూట్‌లో ప్రేమ్‌రక్షిత్ చెప్పిన యానిమేషన్ రిలేటెడ్ ప్రాజెక్టుకి డార్లింగ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారన్నది ట్రెండింగ్‌న్యూస్. పక్కా కేల్కులేషన్ లేకుండా ప్రభాస్ ఏమీ చేయరనే నమ్మకం ఇండస్ట్రీలో చాలా బాగా ఉంది. కానీ, సినిమాలకు సైన్ చేస్తున్న తీరు గురించి మాత్రం చర్చ జరుగుతోంది. చేసేవన్నీ భారీ సినిమాలు… నెంబరాఫ్ వర్కింగ్ డేస్ కూడా ఎక్కువే అవుతున్నాయి.. అలాంటప్పుడు క్యూలో ఇంత మంది డైరక్టర్లనుంచడం న్యాయమా? అనే డిస్కషన్ కూడా షురూ అయింది. ఆల్రెడీ డార్లింగ్ ముందు చాలా మంది ఉన్నారు. ఇప్పుడంటే స్పిరిట్ లైన్లోకి వచ్చింది. ఆ తర్వాత కల్కి2 కోసం నాగ్ అశ్విన్ ఉన్నారు. సలార్ 2 కోసం ప్రశాంత్ నీల్ ఉన్నారు. ఇంత మంది ఉండగానే ప్రభాస్‌తో రాజమౌళి సినిమా త్వరలోనే ఉండొచ్చనే ఊహాగానలు చక్కర్లు కొడుతున్నాయి. రాజమౌళి సినిమా గురించి వార్తలు ట్రెండింగ్‌లో ఉండగానే ప్రేమ్‌రక్షిత్ పేరు జోరుగా వినిపిస్తోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ చెప్పిన స్టోరీకి డార్లింగ్ ఫిదా అయ్యారనే మాట వైరల్ అవుతోంది. ఓ వైపు రాజాసాబ్ ప్రమోషన్లు, ఇంకో వైపు స్పిరిట్, మధ్యలో ఫౌజీ పోస్ట్ ప్రొడక్షన్… ఈ గ్యాప్‌లోనే కొత్త సినిమాల కథలు వినడం, ఫైనలైజ్ చేయడం.. ఇన్ని పనులు ఎలా చేస్తున్నారు డార్లింగ్? చేస్తే చేశారు గానీ, కెప్టెన్లను ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేయించకండి అనే సలహాలు కూడా వినిపిస్తున్నాయి ప్రభాస్‌కి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హీరోల సినిమాల సంఖ్య పెరగాలంటే.. కెప్టెన్లు స్పీడు పెంచాల్సిందేనా
ధనుష్ దర్శకత్వంలో రజినీ సినిమా ??
కొత్త సినిమాలకంటే.. రీ రిలీజ్ సినిమాలపై ఆడియన్స్ ఆసక్తి
మాకు పక్కా హిట్ కావాల్సిందే.. తాడో పేడో తేల్చుకుంటున్న హీరోలు..
ఇదే బాగుంది గురూ.. అద్దెకు బంగారం.. లక్షలు సంపాదించండి
20 ఏళ్లుగా చీకటి గదిలోనే.. బయటకు రాగానే చూపు కోల్పోయిన యువతి
సింహాల డెన్లోకి యువకుడు.. జరిగింది చూసి అంతా షాక్
భర్త చనిపోయినా.. ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జననం
డ్రైవర్ కు ఫిట్స్ .. గాల్లోకి ఎగిరిన మెర్సిడస్ కారు..
బైక్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెంబడించిన వీధి శునకం.. చివరికి..!
చైనా అమ్మాయి వెడ్స్ ఝార్ఖండ్ అబ్బాయి..

