AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త సినిమాలకంటే.. రీ రిలీజ్ సినిమాలపై ఆడియన్స్ ఆసక్తి

కొత్త సినిమాలకంటే.. రీ రిలీజ్ సినిమాలపై ఆడియన్స్ ఆసక్తి

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Phani CH|

Updated on: Nov 18, 2025 | 1:23 PM

Share

రీ-రిలీజ్ సినిమాల ట్రెండ్ తెలుగులో బలంగా ఉన్నా, ప్రేక్షకుల స్పందన మాత్రం ఎంపిక చేసుకునేలా ఉంది. బాహుబలి, శివ వంటి ఐకానిక్ చిత్రాలు భారీ వసూళ్లు సాధిస్తుంటే, చాలా సినిమాలు ఆశించిన మేర రాణించట్లేదు. స్టార్ హీరోల బర్త్ డేలకే కాకుండా ఎప్పుడంటే అప్పుడు విడుదల అవుతున్నప్పటికీ, ఏ సినిమాను థియేటర్లో మళ్లీ చూడాలనేది ఆడియన్స్ మాస్టర్ ప్లాన్.

ఒకప్పట్లా రీ రిలీజ్ సినిమాలు ఇప్పుడు ఆడియన్స్ చూస్తున్నారా..? ఈ ప్రశ్నకు సమాధానం పూర్తిగా ఎస్ అని చెప్పలేం.. అలాగని నో అని చెప్పలేం. నో అంటే బాహుబలి రికార్డులు తిరగరాయదుగా.. అలాగని ఎస్ అంటే మరే ఇతర సినిమాలు ఆ రేంజ్ వసూలు చేయలేదుగా..! దీనివెనక ఆడియన్స్ మాస్టర్ ప్లాన్ మరోలా ఉంది. మరి ఏంటది..? చూసేద్దామా క్లియర్‌గా.. రీ రిలీజ్ సినిమాల ట్రెండ ఇప్పటిది కాదు.. మూడేళ్లుగా వరసగా పాత సినిమాల దుమ్ము దులుపుతూనే ఉన్నారు నిర్మాతలు. మొదట్లో హీరోల బర్త్ డేలకు మాత్రమే రీ రిలీజ్‌లు వచ్చేవి.. కానీ రాను రాను దాన్ని ఓ ట్రెండ్‌లాగా మార్చేసారు. అకేషన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు పాత సినిమాలను రిలీజ్ చేస్తూనే ఉన్నారు. పోకిరి, ఖుషీ, జల్సా లాంటి సినిమాలకు అప్పట్లో మంచి వసూళ్లు వచ్చాయి. అవి చూసి చాలా సినిమాలు రీ రిలీజ్ చేసారు. కానీ ఏదీ అంతగా డబ్బులు తీసుకురాలేదు. ఆరెంజ్, ఖలేజా లాంటి ఒకట్రెండు సినిమాలు తప్పితే.. రీ రిలీజ్‌లో సక్సెస్ పర్సెంటేజ్ తక్కువే. మరోవైపు ఆడియన్స్ కూడా ముందుగానే ఈ సినిమానే చూడాలని మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్సైపోతున్నారు. ఎన్ని సినిమాలు రీ రిలీజ్ చేసినా.. తాము చూడాలనుకున్న సినిమానే చూస్తున్నారు ఆడియన్స్. ఒక జగదేకవీరుడు అతిలోకసుందరి.. ఒక బాహుబలి ఎపిక్.. ఇప్పుడు శివ.. ఇలా కొన్ని ఐకానిక్ సినిమాలు మాత్రమే వాళ్లు మళ్లీ థియేటర్‌కు వచ్చి సెలబ్రేట్ చేస్తున్నారు. అందుకే బాహుబలి ఎపిక్ పదేళ్ళ తర్వాత కూడా 50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 1989లో విడుదలై.. తెలుగు సినిమా గతిని మార్చేసిన శివ సినిమాను 2025లో ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. ఆర్నెళ్ల పాటు వర్మ కష్టపడి చేసిన ఈ న్యూ వర్షన్ ఆఫ్ శివ నేటి జనరేషన్ బానే రిసీవ్ చేసుకున్నారని కలెక్షన్లే చెప్తున్నాయి. 2 రోజుల్లో 3.95 కోట్లు వసూలు చేసింది శివ. ఈ లెక్కన రాబోయే రీ రిలీజ్‌ల విషయంలోనూ ఆడియన్స్ సెలెక్టివ్‌గానే ఉండబోతున్నారని అర్థమవుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మాకు పక్కా హిట్ కావాల్సిందే.. తాడో పేడో తేల్చుకుంటున్న హీరోలు..

టాలీవుడ్ లో తప్పని హీరోయిన్ల కొరత.. కారణం అదేనా ??

Varanasi: రెండు భాగాలుగా రానున్న వారణాసి.. నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్

Akhanda 2: ప్యాన్ ఇండియన్ మార్కెట్ పై బాలయ్య ఫోకస్