Akhanda 2: ప్యాన్ ఇండియన్ మార్కెట్ పై బాలయ్య ఫోకస్
60 ఏళ్లు దాటిన బాలకృష్ణ అఖండ 2 తో పాన్ ఇండియాకు సిద్ధమవుతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో, సనాతన ధర్మం, హిందుత్వం నేపథ్యంతో 3D లో విడుదల కానున్న ఈ చిత్రం భారీ అంచనాలు సృష్టిస్తోంది. ముంబైలో ప్రారంభమైన ప్రమోషన్స్, హిమాలయాల్లో షూటింగ్, బాలయ్య ఫామ్, బోయపాటి విజన్ ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయం.
60 దాటిన తర్వాత మహర్ధశ పడుతుందని పెద్దోళ్లు చెప్తుంటారు కదా..? దానికి సాక్ష్యం కావాలంటే బాలయ్యను చూపిస్తే సరిపోతుంది. అసలు అఖండ నుంచి ఆయన రెచ్చిపోతున్న తీరు చూస్తుంటే ప్యాన్ ఇండియన్ హీరోలకి కూడా కంటిమీద కునుకు లేకుండా పోతుంది. తాజాగా అఖండ 2 అన్ని బ్యారియర్స్ తెంచేయాలని ఫిక్స్ అయిపోయారు నటసింహం. అఖండ 2 ప్రమోషన్స్ చూస్తుంటే ఒకే మాట అనాలనిపిస్తుంది.. బాలయ్య ఈసారి ఏదో భారీగానే ప్లాన్ చేస్తున్నాడని..! మామూలుగానే బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అంటే పూనకాలు ఖాయం.. అలాంటిది ఈసారి వాటికి ఇంకొన్ని అడిషన్స్ చేస్తున్నారు.. దాంతో అభిమానులు మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా అఖండ 2 కోసం కళ్లలో ఒత్తులేసుకుని చూస్తున్నారు. బాలయ్య కెరీర్‌లో మొదటి ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌గా వస్తుంది అఖండ 2. పైగా సినిమాలో సనాతన ధర్మం, హిందుత్వం ఎక్కువగా ఉంది కాబట్టి నార్త్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు బోయపాటి. అందుకే ప్రమోషన్స్ కూడా ముంబై నుంచి షురూ చేసారు. హిమాలయాలు, కుంభమేళా లాంటి చోట్ల మేజర్ పార్ట్ షూట్ చేసారు బోయపాటి. మొన్నే ఫస్ట్ సాంగ్ విడుదల చేసిన టీం.. అంతలోనే అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. అఖండ 2ను 3Dలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఓ వైపు ప్యాన్ ఇండియా.. మరోవైపు 3డి బొమ్మ.. ఇంకోవైపు బాలయ్య ఫామ్.. ఇవన్నీ చూస్తుంటే ఈసారి బాక్సాఫీస్‌కు పూనకాలు కాదు.. ఇంకేదో వచ్చేలా కనిపిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ajay Devgn: రేర్ రికార్డ్ సెట్ చేసిన అజయ్ దేవగన్
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో ఎవరు ??
Dulquer Salmaan: క్రేజీ మల్టీస్టారర్‌కు రెడీ అవుతున్న దుల్కర్ సల్మాన్
Keerthy Suresh: మరో ఇంట్రస్టింగ్ మూవీతో వస్తున్న కీర్తి సురేష్
మనసుల్ని గెలిచిన ఇండిగో పైలట్.. ఒక్క మాటతో
ఇదే బాగుంది గురూ.. అద్దెకు బంగారం.. లక్షలు సంపాదించండి
20 ఏళ్లుగా చీకటి గదిలోనే.. బయటకు రాగానే చూపు కోల్పోయిన యువతి
సింహాల డెన్లోకి యువకుడు.. జరిగింది చూసి అంతా షాక్
భర్త చనిపోయినా.. ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జననం
డ్రైవర్ కు ఫిట్స్ .. గాల్లోకి ఎగిరిన మెర్సిడస్ కారు..
బైక్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెంబడించిన వీధి శునకం.. చివరికి..!

