AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాఫ్ట్ వేర్ CEO నుంచి ఐ - బొమ్మ వ్యవస్థాపకుడిగా

సాఫ్ట్ వేర్ CEO నుంచి ఐ – బొమ్మ వ్యవస్థాపకుడిగా

Phani CH
|

Updated on: Nov 18, 2025 | 3:15 PM

Share

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇమ్మడి రవి, ER ఇన్ఫోటెక్ CEO, నెదర్లాండ్స్ నుండి OTT సర్వర్‌లను హ్యాక్ చేసి ఐ బొమ్మ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సినిమాలను పైరసీ చేశాడు. బెట్టింగ్ యాప్‌లకు యూజర్లను మళ్లించాడు. పోలీసులకు సవాల్ విసిరిన రవిని సైబర్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. అతని పైరసీ సామ్రాజ్యాన్ని అంతమొందించారు.

పైరసీ కింగ్ పిన్‌గా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇమ్మడి రవి.. ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ చదివాడు. నెదర్ల్యాండ్స్, కరేబియన్ దీవులకు వెళ్లే ముందు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీని ఏర్పాటుచేశాడు.. ER infotech అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి CEO గా ఉన్నాడు. ఈ క్రమంలోనే నెదర్లాండ్స్ నుంచి Cloud fare, OTT సర్వర్లను హ్యాక్ చేసి పైరసీలకు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. పైరసీ చేసిన సినిమాలను ఐ బొమ్మ, బప్పం, ఐ విన్, బప్పం టీవీలలో ఇమ్మడి రవి ఉంచుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఐ బొమ్మలో సినిమాలను చూసే వారిని బెట్టింగ్ యాప్స్ వైపు మళ్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించడంతో.. ఈయన పై ఫోకస్ పెంచారు. ఈ క్రమంలోనే నేరుగా పోలీసులకే సవాలు విసరడం… కొందరు ప్రొడ్యూసర్ల సినిమాలను టార్గెట్ చేయడంతో.. ఐ – బొమ్మ రవిని సీరియస్‌గా తీసుకున్నారు పోలీసులు. తమ నెట్‌వర్క్‌తో.. ఇన్నాళ్లూ కూపీ లాగి.. సరైన సమయంలో దాడి చేశారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కటకటాల పాలు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kamal Haasan: కథ నచ్చలేదన్న రజనీ.. లోకనాయకుడు మాత్రం అతని రాకకోసం వెయిటింగ్‌

Chiranjeevi: కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో చిరు.. సరికొత్త లుక్ లో మెగాస్టార్

యానిమేషన్‌ ప్రధానంగా ప్రభాస్‌ – ప్రేమ్‌రక్షిత్‌ సినిమా

హీరోల సినిమాల సంఖ్య పెరగాలంటే.. కెప్టెన్లు స్పీడు పెంచాల్సిందేనా

ధనుష్ దర్శకత్వంలో రజినీ సినిమా ??