AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంపర్‌ ఆఫర్‌ పిల్లలను కంటే రూ. 30 లక్షలు

బంపర్‌ ఆఫర్‌ పిల్లలను కంటే రూ. 30 లక్షలు

Phani CH
|

Updated on: Nov 18, 2025 | 5:10 PM

Share

ఆధునిక యువత పెళ్లి, పిల్లలను భారంగా భావించడంతో ఇటలీ జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 'జనాభా శీతాకాలం'ను నివారించడానికి, ఇటలీ ప్రభుత్వం పెళ్లి చేసుకునే వారికి, పిల్లలను కనే వారికి భారీ నగదు ప్రోత్సాహకాలు, గ్రామీణ పునరుద్ధరణ గ్రాంట్లు, పన్ను రాయితీలు, డిజిటల్ నోమాడ్ వీసా వంటి పథకాలను ప్రకటించింది. ఇవి జననాల రేటును పెంచడంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ఆధునిక యువత పెళ్లి చేసుకోవడం, పిల్లలను కనడాన్ని భారంగా భావిస్తోంది. దీనికి ఆర్థిక అంశాలతో పాటు, ఉరుకులు పరుగుల జీవితం కూడా కారణంగా ఉంటోంది. జననాల రేటు తగ్గడంతో పరిష్కార మార్గాన్ని ఇటలీ దేశం కనుగొంది. పెళ్లి చేసుకునే యువతకు భారీ క్యాష్‌ ప్రైజ్‌, గ్రాంట్‌ను ప్రకటించింది. జనాభా సంక్షోభాన్ని ఇటలీ ఎదుర్కొంటోంది. 2024లో కేవలం 3, 70,000 జననాలతో అత్యల్ప సంఖ్యను నమోదు చేసింది. నిపుణులు దీనిని ‘జనాభా శీతాకాలం’గా చెబుతున్నారు. అంటే తక్కువ సంతానోత్పత్తి రేటు, వృద్ధాప్య జనాభా, పెరిగిన మరణాల రేటుతో ఏర్పడిన పరిస్థితి అన్నమాట. యువ ఇటాలియన్లు వివాహం చేసుకునేందుకు, పిల్లలను కనేందుకు ఆలస్యం చేస్తున్నారు. ఇది ఇటలీ ఆర్థిక, సామాజిక స్థిరత్వానికి ముప్పుగా పరిణమించింది. యువతలో ఉన్న ఈ ధోరణి తగ్గేలా చేసి, జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకు ఇటలీ ప్రభుత్వం రెడీ అయింది. ఇటలీ ప్రభుత్వం యువతకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీనిలో గ్రామీణ పునరావాస గ్రాంట్‌ ఒకటి. దీని కింద గ్రామాలలో వదిలేసిన ఇళ్లను కొనుగోలు చేసి,వాటిని పునరుద్ధరించే వారికి 30 లక్షల రూపాయల వరకు అందిస్తారు. ఆర్థిక స్థిరత్వం కోసం ప్రజలకు నెలవారీ స్టైపెండ్‌లు, వ్యాపార మద్దతును అందిస్తున్నారు. ఈ పథకం ముఖ్యంగా ఇటలీలో ఖాళీ అవుతున్న చిన్న, చారిత్రక పట్టణాలకు ఊపిరి పోయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అక్కడి జనాభా పెరిగేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే పన్ను వ్యవస్థలో రాయితీలను అందిస్తోంది. ఉద్యోగాల కోసం ఇటలీకి తరలివచ్చే నిపుణుల కోసం, ముఖ్యంగా దక్షిణ ప్రాంతాల వారికి పదేళ్ల వరకూ వరకు వారి ఆదాయంలో 70 నుండి 90 శాతం ఆదాయపు పన్ను మినహాయింపునిస్తున్నారు. దీనికితోడు విదేశీ కార్మికులు స్థానికంగా నివసించేందుకు, ఆర్థిక వ్యవస్థకు దోహదపడటానికి అనుమతించే డిజిటల్ నోమాడ్ వీసాను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈ ప్రోత్సాహకాలు జనాభా పెరగడానికి సరిపోకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పిల్లల సంరక్షణ, కుటుంబ జీవితాన్ని ప్రోత్సహించేందుకు సాంస్కృతిక ప్రచారాలు వంటి నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని వారు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దారుణం.. యజమానిని కట్టేసి భారీ దోపిడీ

దుర్గమ్మ ఆలయంలో అద్భుతం.. చూడటానికి రెండు కళ్ళు చాలవు

దాబాలో లంచ్ చేసి బ్యాగ్ మరిచిపోయిన కస్టమర్‌.. ఓపెన్‌ చేయగా

ఐ – బొమ్మ రవి కేసులో ట్విస్టులే ట్విస్టులు

ఇలాంటి కొడుకు పుట్టడం నా కర్మ !! ఐ – బొమ్మ రవి తండ్రి ఎమోషనల్