30 రోజుల్లో 10 కేజీలు తగ్గి.. స్టేజ్ పై కుప్పకూలిన సింగర్
కే-పాప్ సంచలనం హ్యూనా వేదికపై కుప్పకూలడం అభిమానులలో ఆందోళన రేకెత్తించింది. ఇటీవల ఆమె వేగంగా 10 కేజీలు బరువు తగ్గడం, వాసోవాగల్ సింకోప్‌తో పోరాడటం దీనికి కారణాలుగా భావిస్తున్నారు. ఈ ఘటన K-పాప్ పరిశ్రమలో బాడీ ఇమేజ్ ఒత్తిడి, కళాకారుల ఆరోగ్యంపై తీవ్ర చర్చకు దారితీసింది. అభిమానులు ఆమె ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు.
కే పాప్ సంచలనం హ్యూనా ఓ సంగీత ఉత్సవంలో ఉన్నట్టుండి వేదికపైనే కుప్ప కూలిపోవడం సంచలనంగా మారింది. తమ అభిమాన పాప్‌స్టార్ ఆరోగ్యానికి ఏమైందనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. K-పాప్ ఇండస్ట్రీలో బాడీ ఇమేజ్ పని ఒత్తిళ్లపై తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రదర్శన మధ్యలో స్టేజ్‌పై పడిపోవడం అభిమానులలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మ్యూజిక్ ఫెస్టివల్‌లో హ్యునా హిట్ పాట బబుల్ అద్భుతంగా సాగుతోంది. ఫ్యాన్స్ అంతా ఆమె పాటకు మెస్‌మరైజ్ అయ్యారు. ఇంతలో ఆమె వేదికపై కుప్పకూలిపోయింది. దీంతో తోటి కళాకారులంతా పరిగెత్తుకు వచ్చారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇటీవల తాను డైటింగ్ చేసి బాగా బరువు తగ్గినట్టు తెలిపింది హ్యునా. వివాహం తర్వాత తాను స్ట్రిక్ట్ డైట్‌లో ఉన్నానని, కేవలం 30 రోజుల్లోనే 10 కేజీలు తగ్గినట్లు తెలిపింది. ఇంత తక్కువ కాలంలో అంత వెయిట్‌లాసా అని అటు అభిమానులు, ఇటు ఆరోగ్య నిపుణులు షాకయ్యారు. కొన్ని వారాలకే కుప్పకూలడం వారికి మరింత షాకిచ్చింది. తరువాత ఇన్‌స్టా పోస్ట్ ద్వారా స్పందించింది హ్యునా. తన ఫ్యాన్స్‌ను కంగారుపెట్టినందుకు క్షమాపణలు చెప్పింది. విశ్రాంతి తీసుకుంటున్నానని, తన బలాన్ని తిరిగి పొందడంపై దృష్టి సారిస్తున్నానని హామీ ఇచ్చింది. తన షోస్‌కు చిన్న విరామమని కూడా తెలిపింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఆమె అభిమానులు షోస్ కంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలంటూ సింగర్ ను కోరారు. పేరున్న K-పాప్ సింగర్ హ్యూనా గత ఏడాది తోటి గాయకుడు యోంగ్ ని పెళ్లాడింది.ఇటీవల కాస్త బరువు పెరగడంతో ప్రెగ్నెంట్ అంటూ పుకార్లు వచ్చాయి. దీంతో సోషల్ మీడియాద్వారా తన బరువుకు కారణాలపై వివరణ ఇచ్చింది. పెళ్లి తరువాత బాగా తింటున్నానని, అందుకే వెయిట్ పెరిగానని బహిరంగంగా అంగీకరించింది. అదే పోస్ట్‌లో డైట్ చేసి మళ్లీ సన్నగా మారతానని చెప్పుకొచ్చింది. తాను సన్నగా ఉన్నప్పటి ఫోటోలు షేర చేసిన మళ్లీ ఇలా అవ్వాలని ఉందని కోరికను వ్యక్తం చేసింది. హ్యూనా చాలా కాలంగా వాసోవాగల్ సింకోప్‌తో పోరాడుతోంది. ఇది శరీరం ఒత్తిడికి గురైనప్పుడు లేదా అలసటకు ఎక్కువైనప్పుడు మూర్ఛపోవడం. తాజాగా స్టేజ్‌పై ఆమె కుప్పకూలడానికి వేగంగా బరువు తగ్గడం, ఒత్తిడితో కూడుకున్న లైవ్ షోస్ కారణమై ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దినసరి కూలీకి రూ.35 కోట్ల జీఎస్‌టీ బిల్లు
బంపర్ ఆఫర్ పిల్లలను కంటే రూ. 30 లక్షలు
దారుణం.. యజమానిని కట్టేసి భారీ దోపిడీ
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

