AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీసులకే సవాల్ విసిరి.. చివరికి ఇలా

పోలీసులకే సవాల్ విసిరి.. చివరికి ఇలా

Phani CH
|

Updated on: Nov 18, 2025 | 7:13 PM

Share

పుణెలో 21 ఏళ్ల రాహిల్ అనే యువకుడు తన బైక్‌పై "Will Run" నంబర్ ప్లేట్‌తో "దమ్ముంటే పట్టుకోండి" అని పోలీసులకు సోషల్ మీడియాలో సవాల్ విసిరాడు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కొద్ది గంటల్లోనే అతన్ని పట్టుకున్నారు. తప్పు ఒప్పుకుంటూ క్షమాపణ వీడియో పోస్ట్ చేయించారు. ఇలాంటి చర్యలు చట్ట విరుద్ధమని, ప్రజల భద్రతకు ప్రమాదకరమని పోలీసులు హెచ్చరించారు.

నిండా పాతికేళ్లు కూడా లేని ఓ కుర్రాడు పోలీసులకే సవాల్‌ విసిరాడు. దమ్ముంటే పట్టుకోండి.. అంటూ పుష్ప రేంజ్‌లో ఛాలెంజ్ చేసాడు. సోషల్‌ మీడియాలో అది కాస్త వైరల్‌ అయ్యింది. అటు ఇటు తిరిగి పోలీసుకు చేరడంతో వాళ్లూ దాన్ని అంతే సీరియస్‌గా తీసుకున్నారు. “Catch Me If You Can” అంటూ సవాల్ చేసిన ఆ యువకుడిని పట్టుకుని ఓ వీడియో తీయించారు. పుణెలో ఓ కుర్రాడు తన కవాసాకి నింజా బైక్‌కు “Will Run” అనే నెంబర్‌ ప్లేట్‌ పెట్టి.. సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశాడు. దమ్ముంటే పట్టుకోండి అంటూ మరో కుర్రాడు ఆ బైక్‌ తీసి వైరల్‌ చేశాడు. ఈ పోస్ట్‌ను గమనించిన పుణె పోలీసులు “We can, and we will” అంటూ స్పందించారు. కొద్ది గంటల్లోనే రాహిల్‌ను గుర్తించి పట్టుకున్నారు. అనంతరం అతని బైక్, అతని క్షమాపణ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “తప్పు చేశాను, మీరు చేయకండి” అంటూ రాహిల్ వీడియోలో చెప్పాడు. యువకుడ్ని 21 ఏళ్ల రాహిల్‌గా, వీడియో పోస్ట్‌ చేసింది అతని స్నేహితుడు నితీష్‌గా పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. పోలీసులు “Street is not the place to play, boy!” అంటూ గట్టిగా హెచ్చరించారు. ఇదే తరహాలో గురుగ్రామ్‌లో తాజాగా ఇద్దరు యువకులు బైక్ మీద మద్యం సేవిస్తూ వీడియో పోస్ట్ చేశారు. ఆ ఘటనపై కూడా అధికారులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి చర్యలు చట్ట విరుద్ధమని, ప్రజల భద్రతకు ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెజాన్‌ బెజోస్‌ రాకెట్‌తో అంగారకుడి పైకి వ్యోమనౌక

తల్లి చేసిన అద్బుతం కోమాలో నుంచి కూతురు బయటకు

చుట్టూ ఈదుతున్న చేపలు.. వాటి మధ్య లంచ్‌

30 రోజుల్లో 10 కేజీలు తగ్గి.. స్టేజ్‌ పై కుప్పకూలిన సింగర్‌

దినసరి కూలీకి రూ.35 కోట్ల జీఎస్‌టీ బిల్లు