Laptop Funeral: ల్యాప్ టాప్ మరణించింది అంటూ అంత్యక్రియలు ఏర్పాటు చేసిన ఓ వ్యక్తి.. వీడియో వైరల్
Laptop Funeral: మనిషి మరణిస్తే.. అతనికి అంత్యక్రియలు ఘనంగా నిర్వహిస్తారు. అయితే కొంతమంది తమ పెంపుడు జంతువులు, పక్షులు మరణిస్తే వాటికి కూడా అంత్యక్రియలు..
Laptop Funeral: మనిషి మరణిస్తే.. అతనికి అంత్యక్రియలు ఘనంగా నిర్వహిస్తారు. అయితే కొంతమంది తమ పెంపుడు జంతువులు, పక్షులు మరణిస్తే వాటికి కూడా అంత్యక్రియలు జరిపించిన వార్తలు వింటూనే ఉన్నాం.. అయితే తాజాగా ఓ యువకుడు తాను ఎంతో ఇష్టంగా కొనుకున్న ఎలక్ట్రానిక్ వస్తువు పాడైపోతే.. దానికి అంత్యక్రియలు ఏర్పాటు చేశాడు.
ల్యాప్ టాప్ నేటి జనరేషన్ కు ఓ వస్తువు కాదు.. అదొక స్నేహితుడుగా ఫీల్ అవుతున్నాడు. ఇక ఈ ల్యాప్ టాప్ కు రిపేర్ వస్తే.. బాగుచేయించి వాడుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు.. అయితే ఓ టిక్‌టాక్ యూజర్ తన ప్రియమైన ల్యాప్‌టాప్ కోసం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది.
టిక్‌టాక్ సృష్టికర్త జెహ్న్ తన ల్యాప్‌టాప్ కు అంత్యక్రియల ఏర్పాట్లు తన ఇంటిలో చేస్తూ చూపించే వీడియోను పంచుకున్నాడు, అక్కడే ఉన్న ఓ వృద్ధురాలు ల్యాప్ టాప్ చనిపోయిందా అని అడుగుతుంది, దానికి అతను అవును అని చెప్పాడు. ఆ మహిళ శరీరం గురించి అడుగుతుంది, అయితే జెహన్ ల్యాప్‌టాప్ వైపు చూపిస్తూ అది మరణించింది అని చెప్పాడు.. అయితే ల్యాప్ టాప్ అంత్యక్రియల కోసం క్లోజ్డ్ లేదా ఓపెన్ పేటిక కావాలా అని నిర్ణయించలేదు. ఈ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. కొంతమంది ల్యాప్‌టాప్ యొక్క ఆత్మకు శాంతిని కోరుకున్నారు. మరికొందరు జెహ్న్ పకు తమ సానుభూతిని తెలిజేశారు. మరికొందరు ఆ వీడియో చూసి తెగ నవ్వుతున్నారు.
Also Read: ఇన్‌స్టాగ్రామ్ లో శివుడి చేతిలో మద్యం గ్లాసు, మరో చేతిలో మొబైల్ ఫోన్.. సీఈవోపై ఫిర్యాదు