Covid-19 Vaccine: దడ పుట్టిస్తున్న కొత్త వేరియంట్లు.. కొవిడ్ వ్యాక్సినేషన్‌పై బ్రిటన్ కీలక నిర్ణయం

ఒక్కో దేశంలో ఒక్కో కొత్త కొవిడ్ వేరియంట్ పుట్టుకొస్తున్నాయి. కొత్త వేరియంట్లను కూడా తట్టుకుని నిలిచేలా ఆయా దేశాలు వ్యాక్సినేషన్‌లో మార్పులు తీసుకొస్తున్నాయి.

Covid-19 Vaccine: దడ పుట్టిస్తున్న కొత్త వేరియంట్లు.. కొవిడ్ వ్యాక్సినేషన్‌పై బ్రిటన్ కీలక నిర్ణయం
UK Covid Vaccine
Follow us

|

Updated on: Jun 09, 2021 | 5:03 PM

ఒక్కో దేశంలో ఒక్కో కొత్త కొవిడ్ వేరియంట్ పుట్టుకొస్తున్నాయి. కొత్త వేరియంట్లను కూడా తట్టుకుని నిలిచేలా ఆయా దేశాలు వ్యాక్సినేషన్‌లో మార్పులు తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ కూడా వ్యాక్సినేషన్‌పై ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వ్యాక్సిన్ డోసుల మధ్య అంతరాన్ని తగ్గించింది. భారత్‌లో గుర్తించిన డెల్టా వేరియంట్‌కు శక్తి ఎక్కువని  ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)  ఇటీవల ఆందోళన వ్యక్తంచేయడం తెలిసిందే. ఇలాంటి ప్రమాదకరమైన వేరియంట్లు ముందుముందు మరిన్ని పుట్టుకొచ్చే అవకాశముంది. రెండో డోసును ఆలస్యం చేస్తే కొత్త వేరియంట్లు వ్యాక్సిన్‌కు లొంగటం కష్టమేనన్న బ్రిటన్ వైద్య నిపుణుల హెచ్చరించారు. ఆ మేరకు యూకేలో రెండు డోసుల మధ్య అంతరాన్ని 12 వారాల నుంచి 8 వారాలకు తగ్గించారు.

మన దేశంలో కూడా రెండు డోసుల మధ్య అంతరం తగ్గించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ మేరకు సీడీసీ, సీఎస్ఐఆర్, ఐజీబీ పరిశోధకులు కేంద్రానికి సూచించారు. ప్రస్తుతం కొవాగ్జిన్ వ్యాక్సిన్ తొలి డోస్, రెండో డోస్ మధ్య అంతరం 12-16 వారాలుగా ఉంది. ఆ మేరకు మే నెలలో వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ (అంతరం)ను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది.

రెండు డోసుల మధ్య అంతరం దేశ దేశానికి విభిన్నంగా  ఉన్నాయి. దీనిపై ప్రారంభంలో యూకేలో వివాదం నడిచింది. రెండు డోసుల మధ్య అంతరం ఎంత ఉండాలన్నదానిపై నిఫుణుల మధ్య  ఏకాభిప్రాయం లోపించింది. యూకేలో ఆక్స్ ఫర్డ్ అస్ట్రాజెనికా, ఫైజర్-బయోఎన్ టెక్ ఎంఆర్ ఎన్ఏ వ్యాక్సిన్ వినియోగంలో ఉంది. రెండో డోసుల మధ్య అంతరం ఎక్కువగా (3 నెలలు) ఉంటే వ్యాక్సిన్ వల్ల వచ్చే రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు భావించారు. అయితే కొత్త వేరియంట్ బి.1.617.2 లేదా డెల్టా రకం వ్యాప్తి పెరగడంతో వ్యాక్సిన్ డోసుల మధ్య అంతరాన్ని తగ్గించింది యూకే ప్రభుత్వం. బ్రిటన్‌లో తొలి డోస్ అనంతరం 33శాతం మాత్రమే రెండు కంపెనీల వ్యాక్సిన్లు ప్రభావం చూపాయి. ఆస్ట్రాజెనికా రెండో డోస్ తర్వాత ప్రభావం 60శాతంగా ఉండగా… పైజర్ వ్యాక్సిన్ రెండో డోసు తర్వాత ప్రభావం 88 శాతంగా ఉంది.

Covid Vaccine

Covid Vaccine

భారత్‌లోనూ డోసుల మధ్య అంతరం తగ్గించాలి..

భారత్ లో నేషనల్ సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్(ఎన్ సీడీసీ), సీఎస్ఐఆర్, ఇన్సిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ(ఐజీఐబీ) రెండు వ్యాక్సిన్ డోసుల మధ్య అంతరంపై అధ్యయనం చేశారు. మన దేశంలో సెకండ్ వేవ్ కు కారణం ‘డెల్టా’ వేరియంట్ అని ప్రకటన చేశారు. యూకేలో తొలుత బయటపడ్డ బి.1.1.7 లేదా అల్ఫా వేరియంట్ కన్నా డెల్టా వేరియంట్ శక్తివంతమైనదని ఇప్పటికే వైద్య నిపుణులు ప్రకటించారు. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో రెండు డోసుల మధ్య ప్రస్తుతమున్న అంతరాన్ని తగ్గించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

డెల్టా వేరియంట్ ఇన్ఫెక్షన్ ను ముందే గుర్తించి చికిత్స అందించినా.. పాక్షికంగా వ్యాక్సినేషన్ చేసినా వైరస్ వ్యాప్తిని నిలువరించలేమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. వ్యాక్సినేషన్ తరవాత బయటపడ్డ కేసుల్లో డెల్టా వేరియంట్ కన్పిస్తోందని వెల్లడించారు. కొత్త వేరియంట్ ను ఎదుర్కొనడానికి డోసుల మధ్య అంతరాన్ని తగ్గించడం తప్పనిసరిగా పరిశోధకుల సూచించారు. డోసుల మధ్య అంతరం పెంచితే ఎక్కువ మందికి సింగిల్ డోస్ అందుతుందనే వాదన ఉన్నప్పటికీ… వేరియంట్ తీవ్రత దృష్ట్యా డోసుల మధ్య అంతరం తగ్గించాల్సిన అవసరముందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

దేశంలో వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో రెండు వ్యాక్సిన్లు లేదా మూడు వ్యాక్సిన్లను మిశ్రమం చేసి వాడాలన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కొవిషీల్డ్ వ్యాక్సిన్లు కొరతతో మిశ్రమ టీకా డోసుల వాడకంపై అధ్యయనం చేయాలని కేంద్రం ఆదేశించింది.

ఇవి కూడా చదవండి..

చీర ధరించి గుర్రపు స్వారీ చేసిన మోనాలిసా..! అంతేకాదు వోల్వా బస్సు నడుపుతూ ఆశ్చర్యానికి గురిచేసిన ధీర వనిత..

ఐదు రోజుల పాటు ఉచితంగా ఇస్రో మెషీన్‌ లెర్నింగ్‌ కోర్సు.. ఎప్పటి నుంచి అంటే..!

Latest Articles