Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : చీర ధరించి గుర్రపు స్వారీ చేసిన మోనాలిసా..! అంతేకాదు వోల్వా బస్సు నడుపుతూ ఆశ్చర్యానికి గురిచేసిన ధీర వనిత..

Viral Video : చీర ధరించిన మహిళ ఏమి చేయగలదు అంటూ స్త్రీ జాతిని ఎగతాళి చేయడం మానుకోండి. వారు

Viral Video : చీర ధరించి గుర్రపు స్వారీ చేసిన మోనాలిసా..! అంతేకాదు వోల్వా బస్సు నడుపుతూ ఆశ్చర్యానికి గురిచేసిన ధీర వనిత..
Mona Lisa
Follow us
uppula Raju

|

Updated on: Jun 09, 2021 | 4:34 PM

Viral Video : చీర ధరించిన మహిళ ఏమి చేయగలదు అంటూ స్త్రీ జాతిని ఎగతాళి చేయడం మానుకోండి. వారు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. అందుకు నిదర్శనమే ఒడిశాకు చెందిన ఆధునిక మోనాలిసా. జహాల్ గ్రామానికి చెందిన మోనాలిసా బుల్లెట్ రైడింగ్ నుంచి ట్రక్ డ్రైవింగ్ వరకు అన్నీ చీర ధరించి చేస్తుంది. ఇప్పుడు ఆమె తాజా వీడియోలో చీర కట్టులో గుర్రపు స్వారీ చేయడాన్ని చూడవచ్చు. నెటిజన్లు ఈ వీడియోను తెగ వీక్షిస్తున్నారు. వాస్తవానికి ఆమె భర్త బద్రి నారాయణ్ భద్రా యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసిన ఈ వీడియోకు వేలాది వ్యూస్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

మోనాలిసాను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పరిచయం చేసిన భర్తకు తన ఆదరణ మొత్తాన్ని క్రెడిట్ చేస్తుంది. సృజనాత్మక దర్శకుడు, వృత్తిరీత్యా సామాజిక కార్యకర్త అయిన బద్రీ తన యూట్యూబ్ వీడియోలన్నింటిలో కెమెరా వెనుక ఉన్న వ్యక్తి. మోనాలిసా ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియోలను అప్‌లోడ్ చేయడం ద్వారా నెలకు రూ.1.5 లక్షలు సంపాదిస్తుంది. బద్రి యూట్యూబ్ ఛానెల్ మే 2016 లో ప్రారంభించారు. ప్రస్తుతం 2.28 మందికి పైగా సబ్ స్కైబర్స్ ఉన్నారు. యూట్యూబ్ కాకుండా ఆమె వీడియోలను ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా వినియోగదారులు షేర్ చేస్తున్నారు.

ఆమె వోల్వో బస్సును నడుపుతున్న వీడియోలలో ఒకటి ఐఏఎస్ అధికారి అవనీష్ సరన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. మైక్రోబ్లాగింగ్ సైట్‌లో 75 వేలకు పైగా వీక్షణలు, 8 వేలకు పైగా లైక్‌లు రావడంతో శరణ్ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి అధిక స్పందన వచ్చింది. వీడియోపై స్పందిస్తూ చాలా మంది వినియోగదారులు మోనాలిసాను ప్రశంసించారు. ఇది కాకుండా మోనాలిసా జంతు ప్రేమికురాలు. గ్రామంలోని కోతులకు తన చేతులతో తినిపించడం తరచుగా చేస్తుంది. ఒక గ్రామస్తుడు ఆమె గురించి మాట్లాడుతూ.. ఆమె ప్రకృతి ప్రేమికురాలని, తన పెంపుడు జంతువుల కోసం ఎక్కువ సమయం గడుపుతుందని తెలిపాడు. ఆమె ఇల్లు దాదాపు జూను పోలి ఉంటుందన్నాడు.