Man of the Hole: మనుషుల నీడ పడకుండా.. పాతికేళ్లుగా అడవిలోనే ఒంటరిగా.. చివరకు అక్కడే..
Brazil: అభివృద్ధి, నాగరికత పేరుతో మనిషిపై అడవిపై దండెత్తున్నాడు. అక్కడున్న వన్యప్రాణులను తరిమికొడుతున్నాడు. తమ పరాక్రమానికి అడ్డుగా ఉన్నారని అడవిని అమ్మగా భావించి అక్కడే ఉండే ఆదిమజాతులను సైతం నామరూపాల్లేకుండా చేస్తున్నారు.అందమైన అడవులకు నిలయమైన బ్రెజిల్‌లో కూడా కొన్నేళ్ల క్రితం అలా ఓ ఆటవిక తెగ కనుమరుగైంది.
Brazil: అభివృద్ధి, నాగరికత పేరుతో కొందరు అడవిపై దండెత్తున్నాడు. అక్కడున్న వన్యప్రాణులను తరిమికొడుతున్నాడు. తమ పరాక్రమానికి అడ్డుగా ఉన్నారని అడవిని అమ్మగా భావించి అక్కడే ఉండే ఆదిమజాతులను సైతం నామరూపాల్లేకుండా చేస్తున్నారు. అలా అందమైన అడవులకు నిలయమైన బ్రెజిల్‌లో కూడా కొన్నేళ్ల క్రితం ఓ ఆటవిక తెగ కనుమరుగైంది. అయితే అక్రమదారుల ఆగడాల నుంచి ఒక్కడు మాత్రం తప్పించుకున్నాడు. తమ జాతిని అంతమొందించారన్న ఆగ్రహంతో బాహ్య ప్రపంచానికి దూరంగా బతికాడు. తనపై మనుషుల నీడ పడకుండా జీవించాడు. ఇలా ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా 25 ఏళ్ల పాటు అడవిలోనే ఒంటరి జీవనం గడిపాడు. చివరకు అడవితల్లి ఒడిలోనే దిక్కు మొక్కూ లేకుండా ప్రాణాలొదిలాడు. తద్వారా మరొక ఆటవిక జాతి పూర్తిగా మాయమైంది. ఇలా ప్రపంచాన్ని నివ్వెరపర్చిన మ్యాన్ ఆఫ్ ది హోల్ ఇటీవల విగజీవిగా కనిపించాడు.
పాతికేళ్లు ఒంటరిగానే..
బ్రెజిల్‌లో ఓ ఆదివాసీ జాతికి చెందిన చివరి వ్యక్తి ఇటీవల కన్నుమూశాడు. ఈ విషయాన్ని బ్రెజిల్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఓ జాతి పూర్తిగా కనుమరుగైనట్లు అధికారులు పేర్కొన్నారు.. బ్రెజిల్‌లోని రోండోనియా రాష్ట్రంలో టనారు అనే ఆదివాసీ ప్రాంతంలో ఓ పేరు తెలియని వ్యక్తి గత 25 ఏళ్లుగా పూర్తిగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. అతడిని మ్యాన్ ఆఫ్ హోల్ అని కూడా పిలుస్తారు. అతడు జంతువులను వేటాడేందుకు ఎక్కువగా గొయ్యిలు తవ్వాడు. దీంతో అధికారులు ఆ పేరుతో పిలుస్తున్నారు. మరణించేనాటికి అతడికి సుమారు 60 సంవత్సరాల వయసు ఉంటుంది. వివరాల్లోకి వెళితే.. 1970 దశకంలో బ్రెజిల్‌లో జనజీవన స్రవంతికి దూరంగా, మనుషులను కనపడకుండా అడవుల్లో ఓ తెగ నివసించేది. అయితే కొందరు పశువుల కాపరులు వీరిని చంపేశారు. అటవీలోని భూమి కోసమే ఈ దారుణానికి ఒడిగట్టారు. అయితే, వారిలో ఆరుగురు మాత్రం ప్రాణాలతో మిగిలారు.. వారిలో ఐదుగురిని 1995లో అక్రమ మైనింగ్ మాఫియా చంపేసింది. వారి నుంచి తప్పించుకున్న ఒకే ఒక వ్యక్తి మాత్రం ఇన్నాళ్లు అడవిలోనే నివసిస్తున్నాడు. ఈ విషయాన్ని 1996లో బ్రెజిల్ ఆదివాసీ వ్యవహారాల ఏజెన్సీ తెలుసుకొంది. నాటి నుంచి అతడు సంచరించే ప్రాంతాలను ఈ సంస్థ పర్యవేక్షిస్తోంది. ఈ ప్రాంతంలోకి ఇతరులు వెళ్లడంపై బ్రెజిల్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలో ఆ సంస్థ సిబ్బంది ఒకరు గస్తీ నిర్వహిస్తుండగా.. ఆగస్టు 23న ఆదివాసీ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించాడు. రోన్డోనియాలోని తనారు ప్రాంతం సమీపంలో అడవిలో అతడు కర్రలు, ఆకులతో నిర్మించుకున్న గుడిసె బయట ఆగస్టు 23న అతడి మృతదేహం లభ్యమైందని అధికారులు చెప్పారు. అతడు నిద్రపోవడానికి తాడు, ఊడలతో కట్టుకున్న ఊయలలో అతడి మృతదేహం కనపడిందని, శరీరానికి పక్షుల ఈకలు కట్టుకుని తిరిగేవాడని, మృతదేహంపై అవి కనపడ్డాయని చెప్పారు.
బాహ్య ప్రపంచానికి దూరంగా..
అతడు కొన్నేళ్ళుగా అడవిలో పదుల సంఖ్యలో గుడిసెలాంటి నిర్మాణాలు చేసుకున్నాడని అధికారుల చెప్పారు. 2018లో బ్రెజిల్ ప్రభుత్వానికి చెందిన గిరిజన సంక్షేమ వ్యవహారాల అధికారులు ఓ సారి అతడిని అనుకోకుండా చూసి, వీడియో తీయడానికి ప్రయత్నించారని, అతడు అప్పట్లో చెట్టును నరుకుతూ కనపడ్డాడని చెప్పారు. అయితే ఈ విషయాన్ని గమనించిన అతను అక్కడి నుండి మకాం మార్చాడు. పేరు, ఏం భాష మాట్లాడతాడో తెలియని ఈ ఆదివాసీకి మనుషులంటే ద్వేషం కలగడానికి ప్రధాన కారణం.. వాళ్లు అతని తెగను బలిగొనడమే! అందుకే ఎవరైనా ఆహార సాయం అందించినా కూడా.. ఎవరినీ నమ్మేవాడు కాదు.. వాటిని చీధరించుకుని దూరంగా వెళ్లిపోయేవాడు. ఎవరైనా అతన్ని చూసినా.. దగ్గరగా వెళ్లడానికి ప్రయత్నిస్తే.. దాడి చేసేవాడు. బాణాలు, ఈటెలు విసరడం లేదంటే.. అడవి గుండా ఉచ్చులు పన్ని వాటిలో పడేలా చేసేవాడు. అయితే.. చంపేవాడు మాత్రం కాదు. అలా 25 ఏళ్ల పాటు బాహ్య ప్రపంచానికి దూరంగా బతికిన ఆ ఆదిమ వాసీ వ్యక్తి ఇటీవల కన్నుమూశాడు.
An isolated Indigenous man known as the “man of the hole” has died in the Amazon; he is thought to be the last of his tribe
He resisted all attempts to contact him over decades, during which his family was killed. He shot arrows at anyone who came closehttps://t.co/7dK2NiQt7z pic.twitter.com/lTFuWKyDEO
— philip lewis (@Phil_Lewis_) August 28, 2022
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..