Viral News: ఆకాశంలో హరివిల్లు సందడి.. అద్భుతాన్ని చూసిన ప్రజల ఆనందహేల.. వీడియో చూడాల్సిందే..!
ఈ అరుదైన ఇంద్రధనుస్సు. ఇంత ముదురు రంగుల్లో చూపించినప్పుడు ప్రకృతి ప్రేమికులు ఊరికే ఉంటారా..?..ఆ అద్భుతాన్ని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆశ్చర్యంతో చూస్తున్నారు.
Viral News: ప్రకృతి తరచుగా అద్భుతమైన దృశ్యాలను చూపుతుంది. వాటిని చూసిన ప్రజలు కొన్నిసార్లు చాలా ఆనందపడిపోతుంటారు. మరికొన్నిసార్లు ఆశ్చర్యపోతుంటారు కూడా. చైనాలో ఇలాంటిదే ఓ అద్భుత దృశ్యం కనిపించింది. అకస్మాత్తుగా మేఘాల రంగు ఇంద్రధనస్సులా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనా ఆకాశంలో కనిపించిన ఈ ఇంద్రధనుస్సును చూసిన నెటిజన్లు అద్భుతం అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మీరు కూడా ఆకాశంలో ఇంద్రధనస్సును చాలాసార్లు చూసే ఉంటారు. కానీ, ఇప్పటి వరకు అలాంటి ఇంద్రధనస్సును మీరు చూడలేదు. ఆగస్టు 21 న చైనాలో కనిపించింది ఈ అరుదైన వింత దృశ్యం. ఈ అద్భుత ఇంద్రధనస్సును చూసిన ప్రజలు ఒకింత షాక్ అయ్యారు.ఈ ఇంద్రధనస్సును చూస్తుంటే మేఘాల రంగు మారినట్లుగా అనిపిస్తుందంటూ కామెంట్స్ చేశారు.
చైనాలోని బనంగల్‌లో కనిపించింది ఈ అరుదైన ఇంద్రధనుస్సు. ఇంత ముదురు రంగుల్లో చూపించినప్పుడు ప్రకృతి ప్రేమికులు ఊరికే ఉంటారా..?..ఆ అద్భుతాన్ని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆశ్చర్యంతో చూస్తున్నారు.
ఈ వీడియోకు 27.3 మిలియన్ల వీక్షణలు, వేల సంఖ్యలో కామెంట్‌లు వచ్చాయి. ఈ వీడియో ఆగస్టు 21న హైనాన్ ప్రావిన్స్‌లోని హైకౌ నగరంలో చిత్రీకరించినట్టుగా తెలిసింది. ‘పైలస్ అని కూడా పిలువబడే ఈ స్కార్ఫ్ క్లౌడ్ తేమతో కూడిన గాలి.. ఇది క్రమంగా ఘనీభవిస్తుంది. సూర్యకాంతి లంబ కోణంలో పడినప్పుడు… కాంతి మేఘంలోని చుక్కలు, మంచు స్ఫటికాల మధ్య కలసి ఇంద్రధనస్సు ఇలాంటి రంగులను సృష్టిస్తుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి