Gandhi Statue: గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు.. తీవ్రంగా ఖండించిన భారతీయులు..
Gandhi Statue: అమెరికాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. న్యూయార్క్ నగరంలో ఉన్న 8 అడుగుల గాంధీ విగ్రహాన్ని శనివారం అగంతకులు ధ్వంసం చేశారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు..
Gandhi Statue: అమెరికాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. న్యూయార్క్ నగరంలో ఉన్న 8 అడుగుల గాంధీ విగ్రహాన్ని శనివారం అగంతకులు ధ్వంసం చేశారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై వెంటనే కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ చర్యకు పాల్పడిన వారు ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ యూనియన్ స్క్వేర్ పార్కులో గాంధీ విగ్రాహాన్ని 1986, అక్టోబర్2న ఏర్పాటు చేశారు. గాంధీజీ 117వ జయంతి సందర్భంగా గాంధీ మెమోరియల్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఈ విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చారు. అయితే 2001లో కొన్ని కారణాలతో ఈ విగ్రహాన్ని తొలగించగా మళ్లీ 2002లో పునరుర్ధరించారు. గాంధీ విగ్రహంపై దాడిని అమెరికాలోని భారతీయ సంఘాల సమాఖ్య ఛైర్మన్ అంకుర్ వైద్య ఖండించారు. శాంతి, అహింసా మార్గాలను ఆధునిక ప్రపంచానికి పరిచయం చేసిన మహాత్ముడి విగ్రహాన్ని దుండగులు లక్ష్యం చేసుకోవడం విచారకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే అమెరికాలో గాంధీ విగ్రహంపై దాడులు చేయడం ఇదే తొలిసారి కాదు, గతంలో కాలిఫోర్నియాలోని ఓ పార్కులో ఉన్న విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. డేవిస్ సిటీ సెంట్రల్ పార్క్‌లో ఉన్న 6 అడుగుల విగ్రహాన్ని అగంతకులు ధ్వంసం చేసిన ఘటన అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read: Khiladi: క్యాచ్ మీ పాటకు అదిరిపోయే రెస్పాన్స్.. రవితేజ ఖిలాడిని పట్టుకోవడం కష్టమే..
Dark Underarms: చంకలో నల్ల మచ్చలు పోవాలంటే ఈ ఇంటి చిట్కాలను ప్రయత్నించండి..