Winter Olympics: వింటర్ ఒలింపిక్స్ వేడుకలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కునుకు తీసిన వేళ..
Winter Olympics: చైనా(China)లో వింటర్ ఒలింపిక్స్ అంగరంగ వైభంగా ప్రారంభమయ్యాయి. బీజింగ్(Beijing) వేదికగా జరగనున్న ఈ వింటర్ ఒలింపిక్స్ క్రీడలు ఫిబ్రవరి 4న ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి రష్యా..
Winter Olympics: చైనా(China)లో వింటర్ ఒలింపిక్స్ అంగరంగ వైభంగా ప్రారంభమయ్యాయి. బీజింగ్(Beijing) వేదికగా జరగనున్న ఈ వింటర్ ఒలింపిక్స్ క్రీడలు ఫిబ్రవరి 4న ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో పుతిన్‌కి పాపం బాగా నిద్ర వచ్చినట్టుంది. ఉక్రెయిన్ జట్టు ఫ్లాగ్ పట్టుకుని వచ్చే సమయంలో పుతిన్ ఓ కునుకు తీశారు. నిజంగా నిద్ర వచ్చే కునుకు తీశారో.. లేక ఉక్రెయిన్ జట్టును చూడలేక కునుకు వేశారో కానీ ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. .
ఉక్రెయిన్ జట్టు బీజింగ్ జాతీయ స్టేడియంలోకి వచ్చేటప్పుడు కునుకు తీసిన పుతిన్.. రష్యా ఒలింపిక్ కమిటీ జట్టు వచ్చినప్పుడు మాత్రం మళ్లీ మామూలు స్థితికి వచ్చారు. దాంతో పుతిన్ కావాలనే ఉక్రెయిన్ జట్టు వచ్చినప్పుడు కునుకు తీసినట్లు నటించారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కాగా… ఈ పోటీల్లో రష్యా పాల్గొనక పోయినప్పటికీ పుతిన్ మాత్రం వచ్చారు. డోపింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన రష్యా.. గత కొంతకాలంగా చాలా మెగా ఈవెంట్లలో పోటీ చేయడం లేదు. కానీ ఆ స్థానంలో రష్యన్ ఒలింపిక్ కమిటీ(ఆర్‌ఓసీ) పాల్గొంటుంది. ఈ క్రమంలోనే పుతిన్ వింటర్ ఒలింపిక్స్ వేడుకలకు హాజరయ్యారు. ఇలా దొరికిపోయారు.. ఇదిలా ఉంటే , రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రరూపం దాలుస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ చుట్టుపక్కల రష్యా సైనిక బలగాలను మోహరించడంతో యుద్ధ వాతావరణం నెలకొంది.. ఉక్రెయిన్‌పై కన్నెసిన రష్యా.. పలు విమర్శలు ఎదుర్కొంటుంది. రష్యా మొండి వైఖరిపై అగ్రరాజ్యం అమెరికా సైతం కన్నెర్ర చేస్తోంది.
Also Read: