Chinese Phones: కొన్న చైనా ఫోన్లు వదిలించుకోండి.. ఇక నుంచి కొత్త ఫోన్లు కొనవద్దని ఆదేశాలు జారీ చేసిన ఓ దేశం.. ఎందుకంటే

Chinese phones:చైనా వస్తువులు, ముఖ్యంగా  ఎలక్ట్రానిక్ వస్తువులైన సెల్ ఫోన్లు, టీవీలు, లాప్ టాప్ వంటివి అనేక దేశాల ప్రజలు ఉపయోగిస్తున్నారు. అయితే మన దేశ సరిహద్దుల వద్ద సృష్టించిన..

Chinese Phones: కొన్న చైనా ఫోన్లు వదిలించుకోండి.. ఇక నుంచి కొత్త ఫోన్లు కొనవద్దని ఆదేశాలు జారీ చేసిన ఓ దేశం.. ఎందుకంటే
Lithuania
Follow us
Surya Kala

|

Updated on: Sep 27, 2021 | 8:11 AM

Chinese Phones: చైనా వస్తువులు, ముఖ్యంగా  ఎలక్ట్రానిక్ వస్తువులైన సెల్ ఫోన్లు, టీవీలు, లాప్ టాప్ వంటివి అనేక దేశాల ప్రజలు ఉపయోగిస్తున్నారు. అయితే మన దేశ సరిహద్దుల వద్ద సృష్టించిన మారణ హోమంతో ప్రభుత్వం చైనాకు చెందిన కొన్ని సంస్థలను..  భారత ప్రభుత్వ సంస్థలకు చెందిన పనులనుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదని.. ఎక్కడా ప్రజలకు చైనా వస్తువులను వాడవద్దు అంటూ ఆదేశాలు జారీ చేయలేదు. కొంతమంది వర్తక వాణిజ్య సంస్థలు, ప్రజలు మాత్రమే స్వచ్ఛదంగా తమకు తామే చైనా వస్తువులను బహిష్కరించారు.. అయితే ఓ దేశ ప్రభుత్వం తమ ప్రజలకు చైనా ఫోన్లు విసిరికొట్టండని చెప్పింది.. అంతేకాదు.. ఇక నుంచి చైనా ఫోన్లు కొనవద్దు అంటూ చెప్పింది.  తన ఆదేశాలతో ప్రపంచ వ్యాప్తంగా చర్యనీయాంశంగా మారిన ఆ దేశం ఏమిటో తెలుసా..

లిథుయేనియా ప్రభుత్వం తమ దేశ ప్రజలు వాడుతున్న చైనా ఫోన్లను విరిసి కొట్టమని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు భవిష్యత్ లోనూ చైనా ఫోన్లు .. ముఖ్యంగా షియోమీ, హువావీ స్మార్ట్ ఫోన్లు ఖరీదు చేయకూడదని స్పష్టం చేసింది. దీంతో లిథుయేనియా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది.  అంతేకాదు షియోమీ, హువావీ  వాడుతున్న వారు తమ ఫోన్లు ను పడేయమని చెప్పింది. ఇలా చైనా ఫోన్లను ఇక నుంచి ఉపయోగించవద్దు అనడానికి ఆ దేశం బలమైన కారణం చెబుతుంది.

చైనా కంపెనీ ఫోన్లు.. ముఖ్యంగా షియోమీ, హువావీ స్మార్ట్ ఫోన్లు లో సెన్సార్ షిప్ ఉన్నదని..ఆ దేశ రక్షణ శాఖకు చెందిన నేష‌న‌ల్ సైబ‌ర్ సెక్యూరిటీ సెంట‌ర్ ఓ రిపోర్ట్ ని విడుదల చేసింది.  ఈ సెన్సార్ షిప్ కారణంగా స్మార్ట్ ఫోన్లు కొన్ని పదాలను ఆటోమేటిక్ గా బ్లాక్ చేస్తున్నాయని ఆరోపింది.  ఫ్రీ టిబెట్, లాంగ్ లివ్ తైవాన్ ఇండిపెండెన్స్‌, డెమొక్రసీ మూవ్‌మెంట్ వంటి 449 ప‌దాలను ఈ ఫోన్లలోని సెన్సార్‌షిప్ కార‌ణంగా ఆటోమేటిగ్గా బ్లాక్ అవుతున్నాయని ఆ దేశ ర‌క్షణ శాఖ ప్రకటించింది.  షియోమీ ఫ్లాగ్‌షిప్ మోడ‌ల్ ఎంఐ 10టీ 5జీ ఫోన్‌లోనూ ఈ సెన్సార్‌షిప్ క‌నిపించిందని లిథుయేనియా సైబ‌ర్ సెక్యూరిటీ తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.

చైనా ఫోన్లను ఇక నుంచి ఖరీదు చేయవద్దని .. ఇప్పటికే వాడుతున్న చైనా ఫోన్లను వీలుంటే వెంటనే వాటిని వినియోగించడం మానేయమని లిథుయేనియా ర‌క్షణ శాఖ స‌హాయ మంత్రి మార్గిరిస్ అబుకెవిసియ‌స్ ప్రజ‌ల‌కు పిలుపునిచ్చారు.   అయితే లిథుయేనియా చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను షియోమీ సంస్థ ఖండించింది. త‌మ ఫోన్లలో అలాంటి సెన్సార్‌షిప్ లేదని స్పష్టం చేసింది.

ఇటీవల లిథువేనియా,  చైనా మధ్య సంబంధాలు క్షీణించాయి.  బీజింగ్‌లోని లిథివేనియా రాయబారిని ఉపసంహరించుకోవాలని చైనా గత నెలలో డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే..

Also Read:   టీచర్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్‌కి ‘హైటెక్ కాపీ’ ఐడియా.. చెప్పుల్లో బ్లూటూత్‌‌తో వచ్చిన అభ్యర్థులు..