AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajasthan REET Exam: టీచర్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్‌కి ‘హైటెక్ కాపీ’ ఐడియా.. చెప్పుల్లో బ్లూటూత్‌‌తో వచ్చిన అభ్యర్థులు..

Rajasthan REET Exam: బ్లూ టూత్ పరికరాలను అంటే ఇప్పటివరకూ మాట్లాడుకోవడం కోసమే ఉపయోగిస్తారని అందరికీ తెలుసు.. కానీ పరీక్ష రాయడానికి వచ్చిన కొంతమంది హైటెక్ అభ్యర్థులు మాత్రం..

Rajasthan REET Exam: టీచర్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్‌కి 'హైటెక్ కాపీ' ఐడియా.. చెప్పుల్లో బ్లూటూత్‌‌తో వచ్చిన అభ్యర్థులు..
Bluetooth Chappals
Surya Kala
|

Updated on: Sep 27, 2021 | 7:27 AM

Share

Rajasthan REET Exam: బ్లూ టూత్ పరికరాలను అంటే ఇప్పటివరకూ మాట్లాడుకోవడం కోసమే ఉపయోగిస్తారని అందరికీ తెలుసు.. కానీ పరీక్ష రాయడానికి వచ్చిన కొంతమంది హైటెక్ అభ్యర్థులు మాత్రం బ్లూ టూత్ పరికరాన్ని ఉపయోగించి పరీక్షలను రాయడానికి ప్రయత్నించారు. అయితే ఈ హైటెక్ కాపీని చేసింది.. స్టూడెంట్స్ కాదు.. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడానికి పెట్టిన పరీక్షల్లో కొంతమంది వ్యక్తులు. ఈ బ్లూటూత్‌ పరికరాలు చెప్పుల్లో అమర్చుకుని పరీక్ష రాయడానికి వచ్చి పెట్టుబడ్డారు. ఈ ఘటనలో పరీక్ష రాయానికి వచ్చిన ముగ్గురు.. చెప్పులు అమ్మిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే..

ఉపాధ్యాయుల నియామకం కోసం రాజస్థాన్ అర్హత పరీక్ష (ఆర్‌ఇఇటి) భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఆదివారం జరిగింది. ఈ పరీక్షలను రాయడానికి వచ్చిన వ్యక్తులను పరీక్షాకేంద్రాల వద్ద తనిఖీలు చేస్తున్నారు. అప్పుడు బ్లూటూత్‌ పరికరాలతో ప్రత్యేకంగా రూపొందించిన చెప్పులను ధరించిన ముగ్గురు అభ్యర్థులు ఈ పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. చెప్పులను పరిశీలించిన పోలీసులు అనుమానంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం చెప్పులను పరిశీలించగా వాటిల్లో బ్లూటూత్‌ పరికరాలు ఉన్నట్లు గుర్తించామని బికనీర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌  ప్రీతి చంద్ర  చెప్పారు. వెంటనే ఆ ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని.. సెల్ ఫోన్లు, బ్లూటూత్‌ పరికరాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆ చెప్పులను రూ. 6లక్షల పెట్టి కొనుగోలు చేసినట్లు తెలిపారు. చెప్పులను అమ్ముతున్న ముఠా వివరాలను రాబట్టారు. దీంతో పోలీసులు చెప్పులను విక్రయిస్తున్న ముఠాపై దాడి చేశారు. వారిలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. రాజస్థాన్‌లోని దాదాపు 4,000 కేంద్రాల్లో ఆదివారం జరిగిన రీట్‌ పరీక్షకు 16.51 లక్షల అభ్యర్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు.  రాష్ట్రంలో దాదాపు మూడేళ్ల తర్వాత పరీక్ష నిర్వహించారు. ఈ సంఘటనలో పరీక్షా కేంద్రాలను కేటాయించిన జిల్లాల్లో ఇంటర్నెట్‌ను సేవలను ప్రభుత్వం నిలుపుదల చేసింది.

ఈ హైటెక్ కాపీ గురించి వార్తలు వెలుగులోకి వచ్చిన తర్వాత.. ఇటువంటి సంఘటనలు ఇప్పటి వరకూ సినిమాల్లోనే చూశాం..ఇక నిజజీవితంలో కూడా నిజంగా కూడా జరుగుతాయా అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Read: PM Modi: నేడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. పైలట్ దశలో ఆరు కేంద్ర ప్రాంతాలు ఎంపిక