AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యునెస్కో గుర్తింపు పొందిన పార్లమెంట్‌.. గోడలకు పగుళ్లు, పైకప్పు నుంచి నీళ్లు.. ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం

పార్లమెంట్ పైకప్పు నుండి నీరు కారుతోంది. దాని గోడలు పగుళ్లు ఏర్పడుతున్నాయి. భవనం కూలిపోయే ప్రమాదం నిరంతరం పెరుగుతూ ఉందని హౌస్ ఆఫ్ కామన్స్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. మరమ్మతు పనులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, ఇంకా ప్రారంభించకపోతే, పెను విపత్తు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. బిల్డింగ్‌ పరిస్థితి రోజు రోజూకు మరింత దిగజారుతుందని చెప్పింది.

యునెస్కో గుర్తింపు పొందిన పార్లమెంట్‌..  గోడలకు పగుళ్లు, పైకప్పు నుంచి నీళ్లు.. ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం
Britain's Parliament Buildi
Jyothi Gadda
|

Updated on: May 18, 2023 | 10:47 AM

Share

బ్రిటీష్ పార్లమెంట్ నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరం సగటున ఒక మిలియన్ మంది ప్రజలు ఇంత గొప్ప భవనాన్ని సందర్శించటానికి వస్తుంటారు. హౌస్ ఆఫ్ కామన్స్ గా పిలిచే బ్రిటన్ పార్లమెంట్ కు ఇప్పుడు పెను ముప్పు పొంచి ఉంది. ఒక నివేదిక ప్రకారం, ఈ భవనం ఎప్పుడైనా కూలిపోయి పెను విపత్తుగా మారవచ్చు. ఈ నివేదిక బయటకు వచ్చినప్పటి నుంచి ఎంపీల్లో ఉత్కంఠ నెలకొంది. పార్లమెంట్ హౌస్ గోడలకు పగుళ్లు పెరుగుతున్నాయని, పైకప్పు నుంచి నీరు కారుతున్నదని బ్రిటన్ ఎంపీలు బుధవారం హెచ్చరించారు. విపత్తు సంభవించినప్పుడు భవనం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. హౌస్ ఆఫ్ కామన్స్ ఒక చారిత్రాత్మక భవనం, అయితే ఈ నివేదిక వచ్చినప్పటి నుండి పార్లమెంట్‌ సభ్యులు, దాని అభిమానులు నిరాశకు ఆందోళనతో పాటు గురవుతున్నారు.

బ్రిటిష్ పార్లమెంట్ పైకప్పు నుండి నీరు కారుతోంది. దాని గోడలు పగుళ్లు ఏర్పడుతున్నాయి. భవనం కూలిపోయే ప్రమాదం నిరంతరం పెరుగుతూ ఉందని హౌస్ ఆఫ్ కామన్స్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. మరమ్మతు పనులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, ఇంకా ప్రారంభించకపోతే, పెను విపత్తు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. బిల్డింగ్‌ పరిస్థితి రోజు రోజూకు మరింత దిగజారుతుందని చెప్పింది. 19వ శతాబ్దపు భవనం పునరుద్ధరణ చాలా నెమ్మదిగా జరుగుతోందని, వారానికి £2 మిలియన్లు ఖర్చవుతుందని కమిటీ తెలిపింది.

ప్యాలెస్ ఆఫ్ వెస్ట్‌మినిస్టర్‌గా పిలువబడే పార్లమెంటరీ సముదాయం భవిష్యత్తుపై సంవత్సరాల తరబడి నిర్లక్ష్యానికి గురైనట్లు కమిటీ విమర్శించింది. 2018లో పార్లమెంటు సభ్యులు మరమ్మతులకు అనుమతి ఇచ్చారు. 2020 సంవత్సరం మధ్య నాటికి అది వేరే చోటికి మార్చబడుతుందని స్పష్టం చేశారు. కానీ, అవేవీ అమల్లోకి రాలేదు. ఎన్నో ఏళ్లుగా మరమ్మతులు జరగకపోవడంతో భవనం మరింత శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు నుండి నీరు కారుతుంది. పాత ఎయిర్‌ స్టీమ్‌ పైపులు శీతాకాలంలో పగిలిపోతున్నాయి. . దీంతో పాటు గోడలపై నుంచి ప్లాస్టర్ కూడా ఊడి పడటం మొదలైంది. పార్లమెంటు మెకానికల్, ఎలక్ట్రికల్ సిస్టమ్ చివరిగా 1940లలో నవీకరించబడింది. దాదాపు 300 మంది కూలీల సహాయంతో రెండున్నరేళ్లలో మరమ్మతులు చేయిస్తామని హౌస్ ఆఫ్ కామన్స్ కమిటీ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ పై క్లిక్ చేయండి..