AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andra Pradesh: స్టీల్‌ సిటీలో హాట్‌ టాపిక్‌.. ఇన్‌ఫ్రా టెక్‌ కంపెనీపై ఉన్నపళంగా ఐటీ దాడులు..

2019 ఎన్నికల్లో ఏపీలో ఓ రాజకీయ పార్టీకి అక్రమంగా నిధుల మళ్లింపు జరిగింది, అందులో హయగ్రీవ ప్రాజెక్ట్స్ నుంచి 53 కోట్ల రూపాయల నిధులు వెళ్లాయనే అభియోగం నేపథ్యంలో దాడులు జరిగాయాన్న చర్చ నడుస్తోంది. ఆ తర్వాత కూడా దాదాపు రూ.100 కోట్ల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి దాడులు జరిగాయి.

Andra Pradesh: స్టీల్‌ సిటీలో హాట్‌ టాపిక్‌.. ఇన్‌ఫ్రా టెక్‌ కంపెనీపై ఉన్నపళంగా ఐటీ దాడులు..
It Raids
Jyothi Gadda
|

Updated on: May 18, 2023 | 8:34 AM

Share

విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో గల హయగ్రీవ ఇన్‌ఫ్రాటెక్ కార్యాలయంలో ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు నిర్వహించారు . హయగ్రీవ ఇన్ఫ్రాటెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, అనుబంధ సంస్థల డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. మే17 బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు జరిపిన దాడుల్లో పలు కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఏపీలో ఓ రాజకీయ పార్టీకి అక్రమంగా నిధుల మళ్లింపు జరిగింది, అందులో హయగ్రీవ ప్రాజెక్ట్స్ నుంచి 53 కోట్ల రూపాయల నిధులు వెళ్లాయనే అభియోగం నేపథ్యంలో దాడులు జరిగాయాన్న చర్చ నడుస్తోంది. ఆ తర్వాత కూడా దాదాపు రూ.100 కోట్ల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి దాడులు జరిగాయి. అయితే, విశాఖలో ఇన్‌ఫ్రా టెక్‌ కంపెనీపై ఉన్నపళంగా ఐటీ దాడులు రాజకీయ ఉత్కంఠకు తెరలేపాయి. .. కంపెనీ రాజకీయ పార్టీకి నిధులు సమకూర్చిందా? ఎలక్షన్‌ ఫండ్స్ ఇచ్చిందన్న అభియోగాల నేపథ్యంలో దాడులు జరుగుతున్నాయా? ఇప్పుడు ఈ అంశం స్టీల్‌ సిటీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఎంవీపీ కాలనీలో హయగ్రీవ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఆఫీస్‌తో పాటు మేనిజింగ్ డైరెక్టర్ చిలుకూరి జగదీశ్వరుడు, రాధారాణి చిలుకూరి, పున్నం నారాయణ రావు, డెరైక్టర్ నారాయణ శ్రీనివాస్ మూర్తి, ఇంద్రకుమార్, నారాయణ రావు గున్నం ఇళ్లలో ఏకకాలంలో సోదాలు జరిగాయి.

గత నెలలో హైదరాబాద్‌లో నవయుగ ఇన్ఫ్రా పై జరిగిన ఐటీ దాడులకు కొనసాగింపుగా ఈ దాడులు జరుగుతున్నట్లు ప్రాథమికంగా సమాచారం అందుతోంది. నవయుగ నుంచి కొన్ని వర్క్స్ పొందినట్లు ఫేక్ ఇన్వాయిస్‌లు సృష్టించి నగదు బదిలీచేసినట్లుగా ఆధారాలు లభ్యమయ్యాయని తెలుస్తోంది. దీనిపై అటు ఐటీ అధికారులు కానీ, ఇటు హయగ్రివ యాజమాన్యం కానీ ఇంకా నోరు మెదపలేదు. దీంతో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో హయగ్రీవ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ గతంలో జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లు కేంద్ర ఆర్థిక శాఖకు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దానిపై కూడా విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..