చేపల కోసం గాలం వేసిన జాలరి.. రాకెట్‌ వేగంతో మీదకు దూసుకొచ్చిన వల.. అందులో ఏముందంటే..?

కొన్ని కొన్ని సందర్భాల్లో జాలర్ల వలలో చిక్కిన చేపలు, సముద్ర జీవులు వారిని రాత్రికి రాత్రే ధనవంతులుగా కూడా మార్చేస్తుంటాయి. మరికొన్ని సందర్భాల్లో మత్స్యకారులకు ప్రమాదం కలిగించే ప్రాణాంతక జంతువులు కూడా వలలో పడుతుంటాయి. అలాంటివి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల జీవులు ఉన్నాయి.

చేపల కోసం గాలం వేసిన జాలరి.. రాకెట్‌ వేగంతో మీదకు దూసుకొచ్చిన వల.. అందులో ఏముందంటే..?
Fishermen Throwing Net
Follow us

|

Updated on: May 18, 2023 | 9:00 AM

చేపలను పట్టుకోవడానికి వల విసిరిన జాలర్లు దాన్ని ఒడ్డుకు లాగిన తర్వాత కనిపించే వింత జీవులను చూసి అప్పుడప్పుడు మత్స్యకారులు ఆశ్చర్యపోతుంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో జాలర్ల వలలో చిక్కిన చేపలు, సముద్ర జీవులు వారిని రాత్రికి రాత్రే ధనవంతులుగా కూడా మార్చేస్తుంటాయి. మరికొన్ని సందర్భాల్లో మత్స్యకారులకు ప్రమాదం కలిగించే ప్రాణాంతక జంతువులు కూడా వలలో పడుతుంటాయి. అలాంటివి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల జీవులు ఉన్నాయి. వాటి గురించి చాలా మందికి చాలా తక్కువ తెలుసు. మనం ఇంతకు ముందెన్నడూ చూడని సముద్ర జీవులు కూడా ఇందులో అనేకం ఉన్నాయి. అలాంటి అరుదైన, కొత్త జీవులను చూసినప్పుడు మనం ఆశ్చర్యంతో పాటు ఆసక్తి కూడా కలుగుతుంది. నదిలో ఉన్న అలాంటి ఒక జంతువుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూస్తే గూస్‌బంప్స్ వచ్చింది. వైరల్ వీడియోలో, ఒక వ్యక్తి నది ఒడ్డున నిలబడి చేపలను పట్టుకోవడానికి వల వేస్తాడు. అయితే ఆ తర్వాత ఒక భయంకరమైన చేప ఆ వలలో చిక్కుకుంది. అది చూసేందుకు ఎలా ఉందంటే..

వీడియోలో జాలరి నది ఒడ్డున నిలబడి వల విసిరాడు. కాసేపటి తర్వాత వలను వేగంగా లోపలికి లాగుతున్నాడు. అయితే, వల చాలా వేగంగా అతని వైపుకు దూసుకు రావడం కనిపించింది. అయితే, ఆ వలలో భారీ సైజున్న ఒక పెద్ద చేప కనిపించింది. ఆ భయంకరమైన హింసాత్మక చేప నీటిలోంచి ఒక్కసారిగా అతడు నిలబడి ఉన్న చోటుకు ఎగురుకుంటూ రావటంతో అతడు భయపడిపోయాడు. ఊహించని రూపంతో భారీ పొడవైన చేప చూసేందుకు కొండచిలువ పాముల కనిపించింది. అది ఒక్కసారిగా నీళ్లలోంచి బయటకు రావడంతో మత్స్యకారుడు బిగ్గరగా అరుస్తూ.. అక్కడ్నుంచి పరిగెత్తాడు.

ఇవి కూడా చదవండి

అయితే, ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు అది పెద్ద చేపలా కనిపించినప్పటికీ, అది పెద్ద పాము అంటున్నారు. ఇది అరుదైన జీవి కాదని, కానీ, క్యాట్ ఫిష్ లాగా ఉందంటున్నారు. ఆ జీవి చురుకుదనం చూస్తుంటే పాములా అనిపిస్తోందని మరో యూజర్ రాశారు. ‘మంచినీళ్లలో కూడా ఇంత పెద్ద చేపలు ఉన్నాయా’ అని మరో వినియోగదారు రాశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో @suddenlyhapend అనే పేజీ ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియోకు వేల సంఖ్యలో వ్యూస్‌, లైకులు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ పై క్లిక్ చేయండి..