Viral Video: స్ప్లెండర్‌ బైక్‌తో ట్రాక్టర్‌ తయారు చేసిన రైతు.. ప్రత్యేక నాగలితో దున్నుడే దున్నుడు..! అన్నదాత అదుర్స్..

ఓ వ్యక్తి స్ప్లెండర్‌కు బ్యాటరీని అమర్చి ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. అదే విధంగా ఇప్పుడు స్ప్లెండర్ కి సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వైరల్ వీడియోలో ఒక రైతు పాత బైక్‌తో ట్రాక్టర్‌ను తయారు చేశాడు. అంతేకాదు..

Viral Video: స్ప్లెండర్‌ బైక్‌తో ట్రాక్టర్‌ తయారు చేసిన రైతు.. ప్రత్యేక నాగలితో దున్నుడే దున్నుడు..! అన్నదాత అదుర్స్..
Tractor From Old Bike
Follow us
Jyothi Gadda

|

Updated on: May 18, 2023 | 10:00 AM

రోజుకో కొత్త జూగడు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా, ఎవరు ఎలాంటి ఆట ఆడతారో చెప్పలేని పరిస్థితి. కొన్నిసార్లు కొందరు కారును హెలికాప్టర్‌గా చేస్తారు. కొన్నిసార్లు కొందరు ఇటుకలతో కూలర్‌ను తయారు చేస్తారు. తాజాగా ఓ వ్యక్తి స్ప్లెండర్‌కు బ్యాటరీని అమర్చి ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. అదే విధంగా ఇప్పుడు స్ప్లెండర్ కి సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వైరల్ వీడియోలో ఒక రైతు పాత బైక్‌తో ట్రాక్టర్‌ను తయారు చేశాడు. అంతేకాదు.. ఈ ట్రాక్టర్ రైతులకు అనేక వ్యవసాయ పనులను సులభతరం చేస్తుంది. బైక్‌తో తయారు చేసిన ఈ జుగాడు ట్రాక్టర్ వైరల్ వీడియోలో రైతు తన పాత స్ప్లెండర్ బైక్‌తో తయరు చేసిన మినీ ట్రాక్టర్‌ ఎలా ఉందో మీరూ చూడండి..

బైక్ పై కాస్త ఖర్చు పెట్టి ట్రాక్టర్ తయారు చేశాడు ఈ రైతు. ఆ వ్యక్తి బైక్ వెనుక టైరు తీసి దాని స్థానంలో నాగలిని అమర్చాడు. రెండు టైర్లను జతచేయటం ద్వారా, బైక్‌కు మినీ ట్రాక్టర్ రూపం తయారైంది. అంతే కాదు ఈ మినీ ట్రాక్టర్‌తో పొలాన్ని దున్నుతున్న ఈ వ్యక్తి ట్రాక్టర్‌లా నీడనిచ్చేందుకు పైన షెడ్డు కూడా వేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసి పలువురు రైతులు అతని తెలివిని అభినందిస్తున్నారు. ఈ వీడియోను krishna_krishi_yantra అనే పేజీ ద్వారా Instagramలో షేర్‌ చేసారు. ఈ మినీ ట్రాక్టర్‌తో ఈ రైతు పొలం పనులు చేస్తున్న మరికొన్ని వీడియోలను మీరు ఈ పేజీలో చూడొచ్చు. ఈ వీడియోని చాలా మంది నెటిజన్లు లైక్ చేయడంతో పాటు రైతు తన వ్యవసాయం కోసం చేసిన ఈ అద్భుత ప్రయోగాన్ని నెటిజన్లు సైతం పొగడ్తలతో ముంచేస్తున్నారు. వీడియోపై ఇతను ఇంజనీర్లను సైతం ఓడించాడంటూ కొందరు నెటిజన్లు కామెంట్‌ చేస్తుండగా, తక్కువ బడ్జెట్‌తో అద్భుతమైన ట్రాక్టర్ రూపొందించారంటూ మరికొందరు వ్యాఖ్యనించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..