కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఉద్యోగులను ఆ కంపెనీ శిక్షిస్తుందట..జపాన్ లో వింత రూల్ !
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్ ని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కార మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా నిపుణులు, రీసెర్చర్లు అంతా చెబుతుంటే జపాన్ లో ఓ కంపెనీ మాత్రం.. తన రూటే సెపరేటు అంటోంది. తమ సంస్థలో పని చేస్తున్న వర్కర్లు
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్ ని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కార మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా నిపుణులు, రీసెర్చర్లు అంతా చెబుతుంటే జపాన్ లో ఓ కంపెనీ మాత్రం.. తన రూటే సెపరేటు అంటోంది. తమ సంస్థలో పని చేస్తున్న వర్కర్లు, ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకోరాదని, తీసుకుంటే శిక్షిస్తామని, వారిని తొలగిస్తామని, వేతనాలు కూడా చెల్లించబోమని హెచ్చరిస్తోంది. జపాన్ లో అత్యంత పాపులర్ అయిన తమా హోమ్ అనే హోమ్ బిల్డర్స్ సంస్థ ఇలాంటి నిబంధన తెచ్చిందట. తమ కంపెనీ బాస్ షిన్యా తమాకీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారని కొందరు సిబ్బంది వాపోయారు. ఈ దేశంలో ఇళ్ల నిర్మాణం, వెంచర్లు, తదితర కార్యకలాపాలు నిర్వర్తించే ఈ అతి పెద్ద సంస్థ నిర్వాకం బయటపడగానే షేర్ మార్కెట్ లో దీని షేర్ల విలువ 10 శాతం పడిపోయింది.ఈ కంపెనీ బాస్ తమాకీ తమను మరో విధంగా హెచ్చరిస్తున్నాడని..వ్యాక్సిన్ తీసుకున్న ఐదేళ్లలో మీరు చనిపోతారని పైగా 5 జీ ఫోన్లు కూడా అత్యంత ప్రమాదకరమని అంటున్నాడని ఈ కంపెనీ ఉద్యోగులు వెల్లడించినట్టు శుకాన్ బుంషుకు అనే మ్యాగజైన్ పేర్కొంది.
జపాన్ రాజధాని టోక్యోలో గల ఈ హోమ్ బిల్డర్స్ కంపెనీ షేర్లు మూడేళ్ళలో ఎన్నడూ లేనంతగా పడిపోయినట్టు ఈ మ్యాగజైన్ తెలిపింది. సగటున ట్రేడింగ్ వ్యాల్యూ 13 రెట్లు తగ్గిపోగా.. టోపిక్స్ ఇండెక్స్ లో దీని శాతం సైతం పడిపోయింది. ఇండియాతో సహా పలు దేశాలతో ఈ సంస్థ తన వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సంస్థ .ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకోరాదని తాము బలవంతం చేయడం లేదని, ఆది వారి ఇష్టమని అంటోంది. వ్యాక్సిన్ విషయంలో వచ్చిన వార్తలు వాస్తవం కాదని 42 ఏళ్ళ తమాకీ ఖండించారు. తన తండ్రి, ఈ సంస్థ ఫౌండర్ అయిన యసుహితో నుంచి 2018 లో ఈయన బాధ్యతలు స్వీకరించాడు. జపాన్ లో కేవలం 22 శాతం మంది ప్రజలు మాత్రం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : వీడెం పెళ్లికొడకురా బాబు..ఇలా ఉన్నాడు..!పెళ్లి వేడుక లోనే ఆగ్రహం చూపించాడు..షాక్ లో నెటిజన్లు..:Groom And Bride Video.
ఆసక్తికరంగా మారిన పాము, ముంగీస నడుమ హోరాహోరీ..ఆసక్తి రేపుతున్న వీడియో..:Snake and Mongoose Video.