పాకిస్తాన్ లో మాజీ దౌత్యాధికారి షౌకత్ అలీ ముకద్ధం కుమార్తె దారుణ హత్య..నిందితుని అరెస్ట్
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో మాజీ దౌత్యాధికారి షౌకత్ అలీ ముకద్దం కుమార్తె నూర్ ముకదం దారుణ హత్యకు గురైంది. 27 ఏళ్ళ ఈమెను ఇస్లామాబాద్ లో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సీఈఓ కొడుకైన జాహిద్ జఫర్ హతమార్చాడని పోలీసులు తెలిపారు.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో మాజీ దౌత్యాధికారి షౌకత్ అలీ ముకద్దం కుమార్తె నూర్ ముకదం దారుణ హత్యకు గురైంది. 27 ఏళ్ళ ఈమెను ఇస్లామాబాద్ లో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సీఈఓ కొడుకైన జాహిద్ జఫర్ హతమార్చాడని పోలీసులు తెలిపారు. మంగళవారం సాయంత్రం నూర్ ని నగరంలోని ఓ ఫ్లాట్ లో నిందితుడు గన్ తో కాల్చి చంపాడని, ఆమె శరీరాన్ని ముక్కలు చేశాడని ‘సమా టీవీ’ పేర్కొంది. ఈ దాడిలో మరొకరు కూడా గాయపడినట్టు వెల్లడించింది. ఈ కేసులో నూర్ ఫ్రెండ్ ని కూడా పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. కొంత కాలంగా నూర్.. జాహిద్ జఫర్ తో దూరంగా ఉంటోందని, ఈ బ్రేకప్ సహించలేక అతడు ఆమెను హతమార్చాడని తెలియవచ్చింది. డ్రగ్ అడిక్ట్ అయిన ఇతడు సైకలాజికల్ సమస్యలతో కూడా బాధ పడుతున్నాడట. ఈ నెల 20 న నూర్ ఇతని ఇంటికి వెళ్లగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు సమాచారం. కాగా నూర్ తండ్రి షౌకత్ అలీ లోగడ సౌత్ కొరియాకు, తజకిస్థాన్ కు కూడా పాక్ రాయబారిగా పని చేశారు. నూర్ హత్యను పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఆమె కుటుంబానికి సంతాపం తెలిపింది. నిందితునికి కఠిన శిక్ష విధించాలని ట్వీట్ చేసింది.
ఈ నెల 16 న పాకిస్తాన్ లో ఆఫ్ఘానిస్తాన్ రాయబారి నజీబుల్లా అలిఖిల్ కుమార్తె సిల్ సిలా అలిఖిల్ ని దుండగులు కిడ్నాప్ చేసి దారుణంగా టార్చర్ పెట్టి విడుదల చేసిన ఘటన మరువక ముందే నూర్ హత్య జరగడం పాక్ లో దుండగుల అమానుషానికి హద్దుల్లేకుండా పోతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మాజీ రాయబారులు, దౌత్యాధికారుల పిల్లలను టార్గెట్ చేయడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : వీడెం పెళ్లికొడకురా బాబు..ఇలా ఉన్నాడు..!పెళ్లి వేడుక లోనే ఆగ్రహం చూపించాడు..షాక్ లో నెటిజన్లు..:Groom And Bride Video.
ఆసక్తికరంగా మారిన పాము, ముంగీస నడుమ హోరాహోరీ..ఆసక్తి రేపుతున్న వీడియో..:Snake and Mongoose Video.