AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel war: ఇజ్రాయిల్..పాలస్తీనా యుద్ధం.. ప్రజల పరిస్థితి దయానీయం.. మంచినీరు కూడా కరువైపోయిన దుస్థితి!

Israel war: ఇజ్రాయెల్.. పాలస్తీనా సంస్థ హమాస్ (ఇజ్రాయెల్ దీనిని ఉగ్రవాద సంస్థ అని పిలుస్తుంది) మధ్య 9 వ రోజు యుద్ధం కొనసాగింది. యుద్ధం తీవ్రతను ఇరుపక్షాలు భరించాల్సి వచ్చింది.

Israel war: ఇజ్రాయిల్..పాలస్తీనా యుద్ధం.. ప్రజల పరిస్థితి దయానీయం.. మంచినీరు కూడా కరువైపోయిన దుస్థితి!
Israel War
KVD Varma
|

Updated on: May 19, 2021 | 7:43 AM

Share

Israel war: ఇజ్రాయెల్.. పాలస్తీనా సంస్థ హమాస్ (ఇజ్రాయెల్ దీనిని ఉగ్రవాద సంస్థ అని పిలుస్తుంది) మధ్య 9 వ రోజు యుద్ధం కొనసాగింది. యుద్ధం తీవ్రతను ఇరుపక్షాలు భరించాల్సి వచ్చింది. కాని హమాస్ ఆక్రమిత గాజా స్ట్రిప్ ప్రాంతంలో పరిస్థితి మరింత దిగజారింది. ఇక్కడి జనాభా 21 లక్షలు. ఇందులో 11 లక్షల మందికి తాగునీరు, మరుగుదొడ్డి, విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాలు లేవు. బాంబు దాడి ప్రతి వ్యవస్థనూ నాశనం చేసింది. ఇప్పటివరకు 220 మంది యుద్ధంలో మరణించారు. ఇజ్రాయెల్‌లో 12 మంది మరణించారు. వారిలో ఒకరు సైనికుడు. 7 సంవత్సరాల క్రితం, గాజా నగరంలో తాగునీరు, మురుగునీరు, సరైన విద్యుత్ పంపిణీని ఏర్పాటు చేశారు. ఐక్యరాజ్యసమితి కూడా దీనికి సహాయపడింది. నేడు ఈ మొత్తం మౌలిక సదుపాయాలు నాశనమయ్యాయి. వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ఇక్కడ 2.5 లక్షల మందికి తాగునీరు అందించేది. ఇజ్రాయెల్ బాంబు దాడి ద్వారా ఇది నాశనం అయిపొయింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో పైప్‌లైన్ల ద్వారా ఇళ్లకు నీరు సరఫరా చేసేవారు. ఇప్పుడు ఈ పైపులైన్లు ధ్వంసం అయ్యాయి. ఇప్పుడు తాగునీరు లేని ప్రజలు సుమారు 11 లక్షల మంది ఉన్నారు.

అదే పరిస్థితిలో విద్యుత్తు కూడా ఉంది. గాజా నగరంలో విద్యుత్ సరఫరా చైన్ కుప్ప కూలిపోయింది. భయంకరమైన వేడి కారణంగా పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఒక అంచనా ప్రకారం, ప్రస్తుతం 1.2 మిలియన్ల మందికి విద్యుత్ లేదు. బాంబు దాడి కారణంగా పాఠశాలలు కూలిపోవడం కానీ మూసివేయడం కానీ జరిగింది. దీంతో ఇప్పుడు అక్కడ 6 లక్షల మంది పిల్లలు ఇళ్లకు పరిమితం అయిపోయారు. దాదాపు 40 వేల మందిని శరణార్థి శిబిరాల్లో ఉంచారు.

కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్ ధ్వంసం..

జమీందోజ్ అనేది గాజా సిటీలోని ఏకైక కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్. ఇజ్రాయెల్ బాంబు దాడి తరువాత ఇది శిధిలావస్థకు చేరుకుంది. లెబనాన్, అలాగే గాజాలో సంక్రమణ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పుడు ఇటువంటి యుద్ద పరిస్థితి వచ్చింది. కొన్ని ఆసుపత్రులు మిగిలి ఉన్నాయి, కానీ వైద్య సహాయం ఇక్కడ అందుబాటులో లేదు. ఆక్సిజన్ ప్లాంట్లు పనిచేయవు, ఇతర వైద్య పరికరాలు, మందులు బాంబు దాడుల కారణంగా ఇక్కడకు చేరుకోలేకపోతున్నాయి. 6 ఆస్పత్రులు, 7 క్లినిక్లు ఇప్పుడు శిధిలాల క్రింద చిక్కుకుని ఉన్నాయి.

పరిస్థితి మరింత దిగజారిపోతోంది. ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి జనరల్ హైడి జిల్బెర్మాన్ ఆర్మీ రేడియోలో మాట్లాడుతూ.. “ఉగ్రవాద సంస్థలు హమాస్‌ను పూర్తిగా నాశనం చేసే వరకు మేము మా కార్యకలాపాలను ఆపము.” అన్నారు. ఇజ్రాయెల్ మీద దాడి జరిగితే, అది దాని స్వంత మార్గంలో స్పందిస్తుంది. ప్రస్తుతానికి మీరు చూస్తున్నది అదే అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు, తన పౌరులకు అపాయం కలుగుతున్నా సరే హమాస్ కూడా వెనక్కి తగ్గడంలేదు. హమాస్ ఒక ప్రకటనలో ”ఇజ్రాయెల్ వైమానిక దళం ఇళ్ళు మరియు అవసరమైన వ్యక్తుల ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుంటోంది. మేము ఇజ్రాయెల్ పై రాకెట్ల దాడిని కొనసాగిస్తాము.” అని పేర్కొంది.

హమాస్ కాంక్రీట్ సొరంగాలు నిర్మించిందని ఇజ్రాయెల్ ఇప్పటికే తెలుసుకుంది. రాకెట్లను ఇజ్రాయిల్ మీద ప్రయోగించిన తరువాత హమాస్ ప్రజలు వాటిలో దాక్కున్నారు. అందువల్ల ఇజ్రాయిల్ ఈ సొరంగాలను ప్రత్యేక బాంబులతో లక్ష్యంగా చేసుకుంది. వీటిని ధ్వంసం చేయడంలో విజయం సాధించింది.

ఈ యుద్ధంతో ఏర్పడిన పరిణామాలను రెండు వైపులా పోల్చి చూస్తే, 90 శాతం నష్టం పాలస్తీనా, హమాస్‌కు జరిగిందని చాలా స్పష్టమవుతుంది. 2014 కాల్పుల విరమణ తరువాత, గాజా సిటీ , పాలస్తీనియన్లు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నారు. చాలా విజయాలు కూడా సాధించారు. కానీ ఇప్పుడు ఈ యుద్ధంతో మళ్ళీ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయినట్టయింది.

Also Read: సిడ్నీ నగరంలో గగుర్పాటు కలిగించే మ్యూజియం, శవాలతో ప్రదర్శనశాల

Israel strikes Gaza: గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు… హమాస్ నేలు, వారి సొరంగాలే టార్గెట్..