హమాస్ రాకెట్ దాడిలో మరణించిన కేరళ మహిళ కుటుంబానికి ఇజ్రాయెల్ అధ్యక్షుని పరామర్శ , మరి ప్రధాని బెంజమిన్ మాటో ?
హమాస్ రాకెట్ దాడిలో మరణించిన కేరళ మహిళ సౌమ్య సంతోష్ కుటుంబాన్ని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ర్యూవెన్ రివ్లిన్ ఫోన్ లో పరామర్శించారు.
హమాస్ రాకెట్ దాడిలో మరణించిన కేరళ మహిళ సౌమ్య సంతోష్ కుటుంబాన్ని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ర్యూవెన్ రివ్లిన్ ఫోన్ లో పరామర్శించారు. ఇజ్రాయెల్ లోని ఓ ఇంట్లో వృధ్ధ మహిళకు కేర్ టేకర్ గా ఉంటున్న సౌమ్య ఇంటిపై ఈ నెల 11 న జరిగిన రాకెట్ దాడిలో ఆమె మృతి చెందింది. గాజా సిటీ నుంచి హమాస్ ఉగ్రవాదులు ప్రతి రోజూ ఇజ్రాయెల్ పైకి రాకెట్ దాడులు జరుపుతూనే ఉన్నారు. అటు ఇజ్రాయెల్ సైతం తన వైమానిక దాడులతో పాలస్తీనా భూభాగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన సౌమ్య ఏడేళ్లుగా ఇక్కడ పని చేస్తోంది. ఈమెకు తొమ్మిదేళ్ల కొడుకు ఉన్నాడు. ఈ నెల 11 సాయంత్రం ఆమె కేరళలోని తన భర్తతో వీడియో కాల్ లో మాట్లాడుతుండగా హమాస్ రాకెట్ ఎటాక్ జరిగింది. 80 ఏళ్ళ వృధ్ధమహిళ ఆలనా, పాలన చూసుకుంటున్న సౌమ్య ఈ ఘటనలో మృతి చెందగా ఆ వృధ్ద మహిళ గాయాలతో బయటపడింది. సౌమ్య మృత దేహాన్ని ప్రత్యేక విమానంలో ఈనెల 14 న ఇండియాకు పంపారు. నిజానికి సౌమ్య ఉంటున్న ఇల్లు రాకెట్ దాడులను తట్టుకోగలిగే షెల్టర్ కి అతి సమీపంలోనే ఉంది. కేవలం ఒకటి, రెండు నిముషాలక వ్యవధిలో ఈమె, తన యజమానురాలితో బాటు అక్కడికి చేరుకోగలిగేది. కానీ ఇందుకు అవకాశం లేకపోయింది. వీరు ఉంటున్న ఇంటికి ఎలాంటి రక్షణ లేదని తెలిసింది.
భారత్ లో ఇజ్రాయెల్ రాయబారి రాన్ మాల్కా ఇటీవల సౌమ్య సంతోష్ కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. తమ దేశాధ్యక్షుడే స్వయంగా సౌమ్యా కుటుంబాన్ని పరామర్శించినా ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం ఈ ఘటనపై మౌనంగా ఉన్నారు
మరిన్ని ఇక్కడ చూడండి: ఆ వార్తలు కొట్టివేయలేం, ఎగిరే పళ్లాలున్న మాట నిజమే, ధృవీకరించిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా , రీసెర్చ్ జరుగుతోందని వెల్లడి