Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snail Slime Soap: నత్తల జిగురుతో సబ్బుల తయారీ… అక్కడ వీటికి విపరీతమైన క్రేజ్

Soap with Snail: నత్తల జిగురుతో సబ్బుల తయారీ ఇప్పుడు ఫ్రాన్స్‌లో హాట్ టాపిక్. వీటిని వాడితే రకరకాల చర్మ రోగాలు ఫసక్ అయిపోతాయట. ముసలితనం మీ దరిచేరకుండా ఉంచడంలో నత్తల జిగురుతో చేసిన సబ్బులు అద్భుతంగా పనిచేస్తున్నట్లు పరిశోధకలు తేల్చారు.

Snail Slime Soap: నత్తల జిగురుతో సబ్బుల తయారీ... అక్కడ వీటికి విపరీతమైన క్రేజ్
Snail Slime Soap
Follow us
Janardhan Veluru

|

Updated on: May 19, 2021 | 12:25 PM

నత్తల జిగురుతో సబ్బుల తయారీ ఇప్పుడు ఫ్రాన్స్‌లో హాట్ టాపిక్. వీటిని వాడితే రకరకాల చర్మ రోగాలు ఫసక్ అయిపోతాయట. ముసలితనం మన దరిచేరకుండా ఉంచడంలో నత్తల జిగురుతో చేసిన సబ్బులు అద్భుతంగా పనిచేస్తున్నట్లు పరిశోధకలు తేల్చారు. ఇంతకీ ఈ నత్తల జిగురుతో తయారవుతున్న ఈ సబ్బులతో చాలా ఉపయోగాలు  ఉన్నట్లు తేలడంతో  వాటికి ఫ్రాన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

మొలస్కా జాతికి చెందిన జీవుల్లో నత్త కూడా ఒకటి. గాస్ట్రోపోడా తరగతికి చెందిన ఈ నత్తలు..ఎడారులు మొదలుకుని లోతైన సముద్రాల మధ్య విభిన్న పరిసరాలలో జీవిస్తుంటాయి. నత్తలలో కొన్ని సముద్రంలోను, కొన్ని భూమి మీద, మరికొన్ని మంచినీటిలోను నివాసముంటాయి. చాలా నత్తలు శాకాహారులు…కొన్ని సముద్ర నత్తలు మాత్రం ఆమ్నీవోర్లు. సామాన్యంగా మనం ఎక్కువగా చూసే సముద్ర నత్తలు పరిమాణంలో చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని నత్తలు ఊపిరితిత్తులతో శ్వాసక్రియ జరిపితే, మరి కొన్నింటికి చేపలవలె మొప్పలు ఉంటాయి.

నత్తలకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తమను తామే బాగుచేసుకుంటాయి. చిప్ప, శరీరానికి ఏదైనా సమస్య వస్తే సెట్ చేసేసుకుంటాయి. ఇప్పటికే నత్తల పై పలుపరిశోధనలు జరిగాయి. తాజాగా నత్తలు ఓ రకమైన జిగురు పదార్థాన్ని (బురద) స్రవిస్తూ ఉంటాయి.  నత్తల నుంచి ఆ జిగురు పదార్థాన్ని సేకరించిన ఫ్రాన్స్‌కు చెందిన సైంటిస్టులు.దీనిపై లోతైన పరిశోధనలు జరిపారు. 2020లో ఫ్రాన్స్‌లో 60,000 నత్తల నుంచి బురదను సేకరించి…వాటితో సబ్బులు తయారీ చేశారు. 40 నత్తల నుంచి సేకరించిన బురదతో ఓ సబ్బు తయారు చేయగలిగారు. నత్త బురదలో కొల్లాజెన్, ఎలాస్టిన్ అనే పదార్థాలున్నాయి. నత్తల జిగురు మానవ శరీరంపై గాయాలను నయం చేయగలుగుతున్నాయి.  చర్మ కణాలను కొల్లాజెన్ రిపేర్ చేస్తున్నట్లు  సైంటిస్టులు గుర్తించారు. అలాగే ఈ నత్తల జిగురుతో చేసిన సబ్బులు…ముసలితనం రాకుండా ఆపగలవని వారు తేల్చారు.

చర్మానికి వచ్చే రకరకాల వ్యాధుల్ని పోగొట్టే శక్తి ఉంటుందన్నారు నిపుణులు. ఫలితంగా నత్త సబ్బులకు విపరీతమైన క్రేజ్ ఏర్పడుతోంది. ఫ్రాన్స్‌లో డామిన్ డెస్రోచెర్ అనే సైంటిస్ట్ నత్తలను ఫాంలో పెంచుతున్నారు. నత్తల జిగురుతో కాస్మెటిక్ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం 60 వేల నత్తలను పెంచుతున్న డెస్రోచెర…వాటి నుంచి జిగురు పదార్థం సేకరించి సబ్బులు తయారుచేసి విక్రయిస్తున్నారు. దీంతో నత్తల జిగురు పై కాస్మెటిక్ కంపెనీలు ఫోకస్ పెట్టాయి. ఈ జిగురుతో ముసలితనం రాకుండా చేయగలిగితే  డిమాండ్ విపరీతంగా పెరిగే అవకాశముంది. నత్త జిగురుతో చేసిన సబ్బుల ఉపయోగంపై ఫ్రాన్స్ లో మరిన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయి.

మరి నత్తల జిగురుతో చేసిన సబ్బులు మీకూ అందుబాటులోకి వస్తే…వాటిని వినియోగించేందుకు మీరు  సిద్ధమేనా?

ఇవి కూడా చదవండి…ఆ వార్తలు కొట్టివేయలేం, ఎగిరే పళ్లాలున్న మాట నిజమే, ధృవీకరించిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా